అత్యంత హానికరమైన పచ్చపీతలతో విస్కీ తయారు..!

-

ఈ మధ్య వాటర్‌ కొరత ఉందని..కొన్ని దేశాల్లో బీర్ల తయారీకీ యూరిన్‌ ఉపయోగిస్తున్నారు అనే వార్తలను విన్నాం. ఇంకా చాలా వింతైనవే ఆల్కాహాల్‌ తయారీకి వాడుతుతున్నారు. ఇప్పుడు ఏకంగా..పర్యావరణానికి హానికలిగించేవిగా చెప్పుకునే..పచ్చపీతలతో విస్కీ తయారు చేస్తున్నారట. టామ్‌వర్త్ డిస్టిలింగ్ అనే సంస్థ విస్కీని అసాధారణమైన పదార్ధం నుండి తయారు చేస్తోంది. ఇన్వాసివ్ క్రాబ్ జాతికి చెందిన గ్రీన్ క్రాబ్స్‌తో విస్కీని తయారుచేస్తోంది. పీతల విస్కీ “కస్టమ్ క్రాబ్, మొక్కజొన్న, మసాలా మిశ్రమంతో నిండిన బోర్బన్ బేస్‌తో చేస్తోంది.

విస్కీ డెవలపర్లు 40 కిలోల కంటే ఎక్కువ చిన్న పీతలను “క్రాబ్ స్టాక్”గా ఉడకబెట్టారని.. అనంతరం దానిని అంతర్గత తటస్థ ఆల్కహాల్ ఉపయోగించి రోటరీ వాక్యూమ్‌లో తయారు చేసినట్లు టామ్‌వర్త్ డిస్టిలింగ్ యజమాని స్టీవెన్ గ్రాస్ తెలిపారు.

అసలు ఎందుకు ఇలాంటి విస్కీ…

యూరోపియన్ గ్రీన్ క్రాబ్ అనేది క్రస్టేసియన్ ఆక్రమణ జాతి. ఈ పచ్చ పీతలు ఈశాన్య అమెరికాలోని, న్యూ ఇంగ్లాండ్ ప్రాంతం తీర పర్యావరణ వ్యవస్థపై తీవ్రంగా చెడు ప్రభావం చూపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. ఇంకా వీటి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో ఈ పచ్చ పీతల సంఖ్యను అదుపులో ఉంచడానికి.. టామ్‌వర్త్ డిస్టిల్లింగ్ NH గ్రీన్ క్రాబ్ ప్రాజెక్ట్‌తో జతకట్టింది.ఈ పచ్చ పీతలవలన పర్యావరణానికి కలిగిస్తున్న ముప్పుని తొలగించి.. స్థానికులకు ప్రయోజనం కలిగించేలా.. వ్యాపార అంశంగా మార్చడానికి డెకాపాడ్‌ల ప్రవర్తన సంస్థ పరిశోధిస్తోంది. తాజాగా ఈ పీత పానీయాలలో “సీక్రెట్” పదార్ధాన్ని జోడించి.. న్యూ హాంప్‌షైర్ ఆధారిత డ్రింక్‌ను తయారు చేస్తోంది.

వీటిని తయారు చేయడానికి కూడా ధైర్యం ఉన్నవారే ముందుకు రావాలని సంస్థ చెబుతోంది. మొత్తానికి అలా ఏవైతే హాని కలిగిస్తాయో వాటితోనే విస్కీ తయారు చేసేస్తున్నారు. మరీ ఇది తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు రావని తయారీదారులు చెప్తున్నారు కానీ..ఆధారాలు లేవు.

Read more RELATED
Recommended to you

Latest news