భార్యకోసం ఈ వయసులో గుండ్రంగా తిరిగే ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చిన భర్త

ప్రేమలో ఉంటే..ప్రేమించిన వ్యక్తికోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇచ్చి సప్రైజ్ చేయాలనుకుంటారు. అయితే టీనేజ్ లోనే ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు. పెళ్లై పిల్లలు పుట్టాక ప్రేమించిన భార్య పక్కనే ఉన్నా ఆ ప్రేమను చూపించేంత టైం ఆ భర్తకు ఉండదు. అయితే అందరూ ఇలానే ఉంటారనికాదనుకోండి. ఏడుపదుల వయుసులోను ఓ వృద్ధుడు తన భార్యకోసం ఓ ప్రత్యేకమైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చారు. అప్పట్లో షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ ఇచ్చినట్లు. ఆ తాజ్ మహల్ ఎంత ప్రత్యేకమో..ఈ ఇల్లులో కూడా ఓ ప్రత్యేకత ఉందట..అందేంటో మీరు ఓ లూక్కేయండి.
ఉత్తర బోస్నియాకు చెందిన వోజిన్ కుసిక్ అనే 72 ఏళ్ల వృద్ధుడు.. తన భార్య కోసం ఏకంగా గుండ్రంగా తిరిగే ఇంటిని నిర్మించి వార్తల్లో ఎక్కాడు. ఈ రొటేటింగ్ హౌజ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోందంటే..ఆ ఇల్లు ఎంత వైరైటీగా ఉందో.. అరే ఇంత వైరైటీగా నిర్మిచాడంటే..ఆయనేదో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనుకుంటున్నారేమో..కానేకాదు..అసులు అతను ఏం చదువుకోలేదంట..అక్షరంముక్క రాకున్న అద్భుతం సృష్టించాడు.
తన భార్య జుబికాపై ప్రేమకు గుర్తుగా ఈ ఇంటిని నిర్మించి ఆమెకు కానుకగా ఇచ్చానని కుసిక్ తెలిపారు. ఆ ఇళ్లు ఎప్పటికీ తాజాగా ఉండటానికి ముందుబాగం ఆకుపచ్చగా, పైకప్పు నిర్మాణంలో ఎర్రటి మెటల్ ఉపయోగించాడట. అనేక కిటీకిలు కూడా ఏర్పాటు చేసి మెరిసేలా తీర్చిదిద్దాడు. ఈ ఇళ్లు 360 డిగ్రీల్లో చూట్టూ తిరగగలదు. తన భార్య ఏమి చూడాలనుకున్నా ఇంట్లో కూర్చుంటే చాలు.. చుట్టూ ఏం జరిగినా తెలుసుకోగలదని వోజిన్ కుసిక్ చెప్పుకొచ్చారు.

ఈ తిరిగే ఇల్లు ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఇంకా.ఇంటి ముందు పచ్చని భాగం, ఎర్రని లోహపు కప్పుతో నిర్మించిన ఈ ఇళ్లు గుండ్రంగా తిరగడం అనేది అందరినీ ఆకర్షించే విషయం. ఇప్పటివరకూ ఎన్నో వింతవింత ఇళ్లను చూసుకుంటాం కానీ ఈ రొటేడ్ హౌస్ మాత్రం ప్రత్యేకం.

అయితే ఇప్పుడే ఎందుకు చేశాడంటే.. తన వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించిన తరువాత ఇలాంటి ఇల్లు తయారు చేయడానికి తగినంత సమయం దొరికిందని తెలిపారు కుసిక్. ఇంటి పరిసరాల్లోకి వచ్చేవారు తనకు కనిపించడం లేదని తన భార్య జుబికా ఆయనకు చెప్పిందట. దీనికి తోడు బెడ్‌రూమ్‌లో ఎండ ఎక్కువగా పడుతోందని చెప్పడంతో గుండ్రంగా తిరిగే ఇంటిని నిర్మించినట్టు ఆయన అంటున్నారు. గుండ్రంగా తిరిగే ఇంటితో పాటు ముందు తలుపు కూడా తిరుగుతుంది. దీంతో అటువైపు ఎవరు వచ్చినా చూడటానికి వీలవుతుంది. ఎవరైనా వస్తే వారివైపు ఇంటిని తిప్పవచ్చు కూడా. క్రేజీగా ఉంది కదూ.