మనవరాలికి బిస్కెట్ కొనిస్తే.. 2387 కోట్ల లాటరీ తగిలింది..!

673

తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎన్నో లాటరీల్లో పాల్గొన్న చార్లెస్‌కు ఇప్పటి వరకు రూపాయి లాటరీ కూడా తగల్లేదట. కానీ.. తన మనవరాలికి బిస్కెట్ కొనడం వల్ల ఒకేసారి వేల కోట్ల అధిపతిని అయిపోయానంటూ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు చార్లెస్.

మనిషికి లక్కు ఎప్పుడు ఎలా కలిసి వస్తుందో చెప్పలేం. అందుకే ప్రతి మనిషికి ఒకరోజు వస్తుందంటారు. అలాగే ఓ వ్యక్తి తన మనవరాలికి బిస్కెట్ ప్యాకెట్ కొనివ్వడం వల్ల కోటీశ్వరుడైపోయాడు. ఈ ఘటన యూఎస్‌లోని నార్త్ కరోలినాలో చోటు చేసుకున్నది.

66 ఏళ్ల చార్లెస్ జాక్సన్ ఉద్యోగ రిత్యా రిటైర్ అయి ప్రస్తుతం తన పిల్లలు, వాళ్ల పిల్లలతో శేష జీవితాన్ని హాయిగా గడుపుతున్నాడు. ఇటీవల తన భార్య, మనవరాలితో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. తన మనవరాలికి ఇష్టమైన బిస్కెట్‌ను కొనిచ్చాడు. ఆ రెస్టారెంట్‌లో ఏదైనా తీసుకుంటే ఆ వస్తువుతో పాటు ఓ స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ స్క్రాచ్ కార్డ్‌లా ఉంటుంది. దాన్ని స్క్రాచ్ చేస్తే.. దాని మీద ఎంత ఫిగర్ ఉంటే అన్ని డబ్బుల లాటరీ తగిలినట్టే. ఆ స్లిప్‌ను తీసుకెళ్లి తన తాతకు ఇచ్చింది మనవరాలు. ఆ.. ఇందులో ఏముంటుందిలే అని ఏదో ఊరికే అలా దాన్ని స్క్రాచ్ చేసి చూశాడు ఆ వ్యక్తి. అంతే.. తనను తానే నమ్మలేకపోయాడు. ఎందుకంటే అందులో 344.6 మిలియన్ డాలర్లు రాసి ఉంది. అంటే.. అతడికి 344.6 మిలియన్ డాలర్ల లాటరీ తగిలిందన్నమాట. మన కరెన్సీలో 2387 కోట్ల రూపాయలు.