పార్టీ భావజాలం, ప్రణాళికలు, నిర్ణయాలు.. ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజలు తెలియాలంటే.. ఖచ్చితంగా జనసేన తరుపున పేపర్ పుట్టాల్సిందేనని అనుకున్నారట.
అవునా.. నిజమేనా.. అవునంట.. నిజమేనంట. పవన్ కల్యాణ్ పేపర్ పెడుతున్నారట. మళ్లీ ఎన్నికలు రావడానికి ఇంకో ఐదేళ్ల సమయం ఉంది. అప్పటి దాకా జనసేనను మోయాలంటే ఏ మీడియా ముందుకు వస్తుంది. ఈరోజుల్లో ఏ మీడియాకు ఉండాల్సిన హద్దులు ఆ మీడియాకు ఉన్నాయి. మరి.. జనాల్లోకి జనసేన వెళ్లాలంటే ఎలా? మనమే ఓ పేపర్ పెడితే పోలా.. అదిరిపోలా.. అని అనుకున్నారో ఏమో పవన్ కల్యాణ్.. అనుకున్నదే తడువుగా జనసేన పక్షాన ఓ పేపర్‌ను పెట్టాలని నిర్ణయించుకున్నారట.
పార్టీ భావజాలం, ప్రణాళికలు, నిర్ణయాలు.. ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజలు తెలియాలంటే.. ఖచ్చితంగా జనసేన తరుపున పేపర్ పుట్టాల్సిందేనని అనుకున్నారట. దీంతో వెంటనే పేపర్ పెడుతున్నట్టు ప్రకటించారు. మేధావులు లాంటి వాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి ఆ పేపర్ ఒక వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక ఎల్లవేళలా మార్గం చూపించాలని ఆయన అన్నారు.
అయితే.. పత్రిక పేరు.. ఎప్పుడు రాబోతుంది.. లాంటి విషయాలు ఇంకా తెలియనప్పటికీ.. పత్రిక గురించి పూర్తిగా అధ్యయనం చేయడానికి.. ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.