ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న మిస్ మెక్సికో..!

-

మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీ లియోన్ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఆమె వయసు 26 ఏళ్లు. చైనాలోని సన్యాలో ఈ పోటీలు జరిగాయి. థాయ్ లాండ్ కు చెందిన నికోలేనే ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.  తర్వాతి స్థానాల్లో బెలారస్ కు చెందిన మారియా, జమైకా కు చెందిన కదీజా, ఉగాండాకు చెందిన అబేనక్యోలు నిలిచారు.

ఇక.. ఇండియా నుంచి ప్రపంచ సుందరి పోటీలకు పోటీ పడిన 19 ఏళ్ల అనుకృతి వాస్ టాప్ 30 లో కూడా చోటు దక్కించుకోలేదు. మొత్తం 118 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న వెనెస్సాకు మాజీ ప్రపంచ సుందరి మానుషీ ఛిల్లర్ కిరీటాన్ని అందించింది. మానుషీ ది భారతే. ఆమె 2017 సంవత్సరంలో ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version