క్వారంటైన్ లోనే వివాహం చేసుకున్న ప్రేమికులు

-

ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా లాక్ డౌన్ తో పెళ్ళిళ్ళు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఎవరు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. పెళ్లి చేసుకోవాలి అంటే కచ్చితంగా క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి దేశ వ్యాప్తంగా ఉంది. అలాంటిది ఒక జంట క్వారంటైన్ లో పెళ్లి చేసుకుంది. ఇటీవల కరోనా లక్షణాలతో ఓడిశాలోని పూరి జిల్లా సాగాడ గ్రామానికి చెందిన 19 ఏళ్ళ సౌరబ్ దాస్ అనే యువకుడు…

అదే గ్రామానికి చెందిన పింకీ రాణీ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమెను తీసుకుని ఇటీవల సౌరభ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ కి పారిపోయాడు. అక్కడ ప్లాస్టిక్ కంపెనీలో పని చేస్తూ ఆమెతో ఉంటున్నాడు. లాక్ డౌన్ దెబ్బకు కంపెనీ మూసి వేయడంతో అతను గుజరాత్ నుంచి వచ్చేసి ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే వారికి అనుమానం వచ్చి అధికారులు కరోనా పరిక్షలు చేసారు… నెగటివ్ అని వచ్చింది.

అయినా సరే జాగ్రత్తగా వారిని 14 రోజుల పాటు సాగాడ గ్రామంలోని క్వారంటైన్ లో ఉంచారు. ఇక వీరు సహజీవనం చేయడంతో పింకీరాణి గర్భం దాల్చింది. క్వారంటైన్ లోనే పెళ్లి చేసుకోవాలని భావించారు. తమను అడ్డుకునే వారు అడ్డు చెప్పే వారు ఎవరూ లేకపోవడంతో ఇంచార్జ్ లు గా ఉన్న ఇద్దరు టీచర్లు కన్యాదానం కూడా చేసారు. ఇక కొంత మంది వారి పెళ్ళికి సహకరించడం తో వారు అక్కడే వివాహం కూడా చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news