తాను చేతిలో పట్టుకున్న ఆ స్టిక్ ఆక్యుప్రెషర్ రోలర్ అని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఆ స్టిక్‌ను చేతుల్లో పట్టుకుని రోల్ చేస్తానని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశమై అక్కడి మామల్లపురం బీచ్‌లో మార్నింగ్ వాక్ చేస్తూ ప్లాస్టిక్ వ్యర్థాలు, బాటిల్స్‌ను ఏరివేసిన విషయం విదితమే. అయితే ప్రధాని చేసిన ఆ పనికి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఆయన చేసిన పనిని పొగిడితే మరికొందరు విమర్శించారు. కాగా.. ఈ విషయం పక్కన పెడితే.. ఆయన బీచ్‌లో చెత్త ఏరేటప్పుడు, ఆ తరువాత చేతిలో ఓ చిన్నపాటి స్టిక్ లాంటి పరికరాన్ని పట్టుకుని తిరగడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రధాని మోదీ పట్టుకున్న ఆ స్టిక్ ఏమిటా.. అని అందరూ ఆరా తీశారు. అయితే దానిపై మోదీయే సమాధానమిచ్చారు.
తాను చేతిలో పట్టుకున్న ఆ స్టిక్ ఆక్యుప్రెషర్ రోలర్ అని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఆ స్టిక్‌ను చేతుల్లో పట్టుకుని రోల్ చేస్తానని చెప్పారు. దీంతో ఇప్పుడా స్టిక్‌ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే నిజానికి ఆ స్టిక్ ఆక్యుప్రెషర్ పద్ధతిలో మనం ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించి మనకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. దీంతో నిత్యం మనం ఎదుర్కొనే ఆందోళనలు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది.
Since yesterday, many of you have been asking – what is it that I was carrying in my hands when I went plogging at a beach in Mamallapuram.
It is an acupressure roller that I often use. I have found it to be very helpful. pic.twitter.com/NdL3rR7Bna
— Narendra Modi (@narendramodi) October 13, 2019
మనకు ఆన్‌లైన్‌లో సదరు ఆక్యుప్రెషర్ రోలర్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. రూ.200 మొదలుకొని రకరకాల పదార్థాలతో తయారుచేయబడిన రోలర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే.. తమ అభిరుచికి తగినట్లుగా ఆక్యుప్రెషర్ రోలర్‌ను కొనుగోలు చేయవచ్చు..!