మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంచుకోవాల్సిన ఆర్థిక పథకాలేంటో తెలుసుకోండి..

-

రేపేంటో ఎవ్వరికీ తెలియదు. డబ్బు అవసరం ఎప్పుడు పడుతుందో చెప్పలేం. కాబట్టి, ఎప్పటికప్పుడు మన ఆర్థిక స్థితిగతులని బేరీజు వేసుకుంటూ ఉండాలి. లేదంటే భవిష్యత్తులో రాబోయే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుకై ఇప్పటి నుండే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు అందివ్వాలంటే అది తప్పనిసరి. దానికోసం ఎందులో పెట్టుబడులు పెడితే బాగుంటుందో తెలుసుకోండి..


మ్యూఛువల్ ఫండ్స్

మ్యూఛువల్ ఫండ్లలో పిల్లల కోసం ప్రత్యేకమైన పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీలో పెట్టుబడులు వెళ్తాయి కాబట్టి ఎక్కువ కాలంలో ఎలాంటి నష్టం రాకుండా ఉంటుంది. పిల్లలు పుట్టగానే ఎంతో కొంత డబ్బుని మ్యూచువల్ ఫండ్లలో పెట్టేయండి. పిల్లలకి 18ఏళ్ళు వచ్చేసరికి వారి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమో, లేదా మరింకోదానికో పనికొస్తాయి.

బంగారంపై

ఈ మధ్య కాలంలో బంగారంపై పెట్టుబడులు చాలా లాభసాటిగా ఉంటున్నాయి. మన దేశంలో ఐతే మరీనూ. మన సాంప్రదాయాల్లో బంగారానికి ఉన్న విశిష్టత కారణంగా దానికి బాగా విలువ ఉంటుంది. మీకున్న కొద్ది పాటి పెట్టుబడుల్లో బంగారంపై కూడా కొద్దిగా పెట్టండి.

సుకన్య సమృద్ధి యోజన పథకం

ఆడపిల్లల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకం చాలా మేలైనది. 10ఏళ్ల లోపు బాలికలకు పోస్టాఫీసులో ఈ పథకం కింద అకౌంట్ తెరిస్తే సరిపోతుంది. బాలికకి 14ఏళ్ళు వచ్చే వరకు డిపాజిట్ చేస్తూ ఉండాలి. 21ఏళ్ళు వచ్చాక ఆ అమౌంట్ మెట్యూరిటీకి వస్తుంది. ఇందులో వడ్డీరేటు కూడా బాగానే ఉంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్

తక్కువ అమౌంట్ తో పెట్టుబడులు పెట్టాలనుకుంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ని మించినది లేదని చెప్పుకోవచ్చు. ఇందులో కనీసం వంద రూపాయల నుండి పెట్టుబడులు పెట్టవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news