ఇదేం చిత్రం రా నాయనా..మందు, చిప్స్ తో రచ్చ..

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కోతులకు సంబందించిన వీడియోలు ఎక్కువగానే దర్శనం ఇస్తున్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కోతి మద్యం తాగి మత్తులో ఉన్న వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.అసలు విషయమేమిటంటే.. మద్యం తాగిన తర్వాత కోతి కూడా ఆ రుచిని ఆస్వాదిస్తూ కనిపించింది. ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందినది. ఇప్పుడు ఈ వైరల్ వీడియో క్లిప్ చూసిన వారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

అక్కడ పొలంలో కూర్చొని కొందరు యువకులు మద్యం సేవిస్తున్నారని.. అప్పుడు అక్కడకు వచ్చిన కోతి ఆ యువకులను తరిమి కొట్టింది. అంతేకాదు.. ఆ యువకులు తాగుతూ వదిలేసిన గ్లాస్ లోని మద్యాన్ని రుచి చూసి ఆనందించడం ప్రారంభించిందని చూసిన వారు చెబుతున్నారు.వివరాల్లోకి వెళితే..ఈ వీడియో శివపురి జిల్లాలోని కరోరా తహసీల్ ప్రాంతానికి చెందినది. రోడ్డు పక్కనే ఉన్న మైదానంలో ఇద్దరు యువకులు మద్యం సేవిస్తున్నారు. ఈ సమయంలో కోతి అక్కడకు చేరుకుని వారిని బెదిరించింది. అక్కడ ఉన్న ఆహార పదార్థాలను చూసి యువకులను కరవడానికి ప్రయత్నించడంతో ఇద్దరు యువకులు అక్కడ నుంచి పరుగులు తీశారు.

కోతి అలా దగ్గరికి రావడం చూసి యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే మరుసటి క్షణం ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లిప్‌లో కోతి ఆల్కహాల్ ఉన్నగ్లాస్ ని తీసుకుని చకచకా తాగింది. అనంతరం సమీపంలో పడి ఉన్న చిప్స్ ప్యాకెట్‌ను చింపి తిని ఎంజాయ్ చేసింది..కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నామని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ కోతులు మోటార్‌సైకిల్‌ పై ప్రయాణిస్తున్న వారిపై దాడి చేస్తున్నాయని.. మరి కొన్నిసార్లు కాలినడకన వెళ్తున్న వారిపై దాడి చేస్తాయని చెబుతున్నారు. వీడియోలో కనిపించిన కోతి మానసిక సమతుల్యతను కోల్పోయిందని గ్రామస్తులు చెప్పారు..ఎన్నో వింతలను చేస్తుందని అక్కడి వారు చెబుతున్నారు..ఏది ఏమైనా ఆ కోతి చేస్తున్న పనులు మాత్రం ఫన్నిగా అనిపిస్తున్నాయి..