కోతినా..మజాకా..దెబ్బకు తిక్కకుదిరింది..

-

మనిషి కోతి నుంచి వచ్చిందన్న విషయం తెలిసిందే..అందుకేనేమో స్వభావంలో మనుషులకు చాలా దగ్గరగా ఉంటాయి కోతులు. ప్రపంచంలో అత్యంత తెలివైన జంతువుల్లో వానరాలను కూడా ఒకటిగా పరిగణిస్తారు..వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారు..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కోతులు,మనుషుల మధ్య జరుగుతున్న వార్ ల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. కొన్ని వీడియోలు ఫన్నీగా వుంటే మరి కొన్ని మాత్రం కామెంట్ల తో రచ్చ చేస్తున్నాయి..తాజాగా ఓ వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది.

తిండి విషయంలో తమ తెలివి తేటలను చాలా చక్కగా వినియోగించుకుంటాయి మూగ జీవాలు. ఇటీవల అవి ఫోన్లు, కళ్లజోళ్లు ఇతర వస్తువులను లాక్కెళ్లడాన్ని మనం చూశాం. వాటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరలయ్యాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా ఫన్నీ వీడియోగా అనిపిస్తున్నప్పటికీ కోతి అసాధారణ ప్రవర్తనతో ఆ మహిళ చాలా ఇబ్బంది పడింది. ఈ వైరల్‌ వీడియోలో కోపంతో ఉన్న కోతి ఓ మహిళపై దాడి చేస్తుంది. ఆమె జట్టును పట్టుకుని గట్టిగా లాగుతుంది. దీంతో మహిళ భయపడిపోయి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

అయితే కోతి మాత్రం వెనక్కుతగ్గదు. మహిళ ధరించిన హెయిర్‌ క్లిప్‌తో సహా పట్టుకుని లాగుతంది. ఇదంతా చూసిన ఒక వ్యక్తి అక్కడకు వస్తాడు. దీంతో వెంటనే అక్కడి నుంచి మారిపోతుంది.అసలు ఆ మహిళను ఎందుకు ఇబ్బంది పెట్టిందనేది మాత్రం ఆ వీడియోలో చూపించలెదు..సోషల్‌ మీడియాలో ఈ ఫన్నీ వీడియోను షేర్‌ చేశారు. ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. అలాగే 27 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news