ఏదైనా విభిన్న తరహాలో సినిమాలు చేయడంలో సౌత్ ఇండియా సూపర్ స్టార్ కమలహాసన్ మొదటి స్థానంలో ఉంటారు. అందుకే ఈయనను విశ్వ నటుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇకపోతే ఆ దర్శకుడు భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడంలో ముందుంటారు. ఇక అలా వీరిద్దరి కాంబినేషన్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఒక అంశంతో భారతీయుడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే ఇప్పటి అవినీతి మీద ఎలా పోరాడి ఉండేవారో అనే స్టోరీ లైన్ ఎంచుకుని తెరకెక్కించిన సినిమా ఇది.
అన్ని భాషల్లో రీమేక్ చేసిన ఈ సినిమా సుమారుగా రూ. 60 కోట్ల కలెక్షన్ రాబట్టింది. అంతే కాదు డబ్బింగ్ మూవీస్ లో రికార్డ్ గా నిలిచింది . ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యూయల్ పాత్ర చేయడం, కేవలం రూ. 12 కోట్ల బడ్జెట్తో సినిమా తెరకెక్కించడం అన్నీ కూడా సినిమాకు ప్లస్ గా నిలిచాయి. ఇకపోతే ఈ సినిమాలో కమలహాసన్ 2 గెటప్స్ లో తన అద్భుత నటనను ప్రదర్శించారు. మొదటగా.. ఐశ్వర్యరాయ్, శిల్పా శెట్టి వంటి హీరోయిన్ల కోసం ట్రై చేస్తే వారికి డేట్స్ కుదరక మనిషా కొయిరాలా సెలెక్ట్ చేశారు. ఇక స్వాతంత్ర సమరయోధుడు భార్య గెటప్ లో రాధికను అనుకుంటే ఆమె కుదరదు అని చెప్పడంతో సుకన్యను తీసుకున్నారు.
ఇక ఈ సినిమాలో కమలహాసన్ గెటప్ వేయడానికి రోజుకు 5:00 గంటలు, తీయడానికి 2:00 గంటల సమయం పట్టేదట. అంతేకాదు కేవలం ఆయన మేకప్ కోసమే కోటి రూపాయలు వెచ్చించి మరి అమెరికా నుంచి మేకప్ మెన్స్ ను తీసుకొచ్చారట. కొడుకు పాత్ర కోసం అజిత్ ని తీసుకోవాలని భావించారట. కానీ రెండు పాత్రలను తానే చేస్తాను అని కమల్ హాసన్ చెప్పడంతో పెద్ద ఇబ్బంది తప్పిందని సమాచారం. ఇక ఈ సినిమా ఇప్పటికీ కూడా మంచి ప్రేక్షక ఆదరణ పొందుతోంది.