యాపిల్ సిరి తెలుసు కదా. యాపిల్ డివైజ్‌లలో ఏదైనా అప్లికేషన్ తెలియకపోయినా.. ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలన్నా.. ఇంకా వేరే ఏదైనా చేయాలన్నా.. సిరి అసిస్టెన్స్ తీసుకోవచ్చు. సిరితో మాట్లాడితే.. అది మనకు కావాల్సిన అప్లికేషన్లోకి తీసుకెళ్తుంది. వాయిస్ ఓవర్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సిరి పనిచేస్తుంది. అంతా వర్చువల్. వాయిస్ కూడా వర్చువల్‌గానే వస్తుంది.
అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అచ్చం యాపిల్ సిరి వాయిస్‌తో ఓ యువతి మాట్లాడుతోంది. ఆ యువతి సిరిలా మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత వారమే ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయింది. ఇప్పటికే ఆ వీడియోకు 16 మిలియన్ వ్యూస్ దాటాయి. అయితే.. అచ్చం యాపిల్ సిరిలా మాట్లాడుతున్న ఆ యువతిపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతా ఫేక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో అది ఫేక్ కాదని.. నిజంగానే తన వాయిస్ బాగుంటుందంటూ… ఆ యువతి మరో వీడియో చేసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.