వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి చిప్ లేని డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవనే విషయం తెలిసిందే కదా. ఆన్‌లైన్ మోసాలను తగ్గించడానికి, సెక్యూరిటీని పెంచడానికే ఆర్బీఐ.. అన్ని ఏటీఎం కార్డులకు ఈఎంవీ బేస్డ్ చిప్‌ను పొందుపరచాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. చిప్ లేని ఏటీఎం కార్డులు ఉన్నవాళ్లు ప్రత్యేకంగా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంకులే చిప్ లేని ఏటీఎంలు ఉన్న కస్టమర్ల అడ్రస్‌కు చిప్ ఉన్న కార్డులను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తోంది.
ఇప్పటికే అన్ని బ్యాంకులు.. తమ కస్టమర్ల అడ్రస్‌కు వాళ్ల కొత్త ఏటీఎం కార్డులను పంపించాయి. కాబట్టి.. చిప్ లేదని.. అప్లయి చేయలేదని.. కొత్త ఏటీఎం కార్డు లేదని టెన్షన్ పడకండి. వచ్చే నెల ఒకటో తారీఖులోపు మీ ఇంటికే కొత్త ఏటీఎం కార్డు వస్తుంది. దీంతో మీరు చిప్ బేస్డ్ ఏటీఎం కార్డులను వాడేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇంటికి కార్డు రాకపోతే.. అప్పుడు సంబంధిత బ్యాంకును సంప్రదించాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.