పావురాలతో యమ డేంజర్‌.. ఊపిరితిత్తులు ప్రమాదంలో పడతాయి జాగ్రత్త..

-

పావురాలకు ఆహారం వేయడం.. వాటిని పెంచుకోవడం చాలామందికి ఇష్టం.. హైదరాబాద్‌లో అయితే.. కొన్ని ఏరియాల్లో..పావురాలు డైలీ ఇంటికి వస్తాయి.. మనం ఏం పెట్టినా తింటాయి. పావురాలతో మంచి టైమ్‌ పాస్‌ అవుతుంది కానీ..వీటి వల్ల మన ఆరోగ్యం పాడవుతుందని మీకు తెలుసా..? ఇప్పటికే పావురాలపై ఎన్నో కథనాలు ఉన్నాయి. సినీనటి మీనా భర్త కూడా పావురాల వల్ల వచ్చిన ఇన్‌ఫెక్షన్‌ వల్లే చనిపోయారని అప్పట్లే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. మనుషులలో హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ (HP), ఇతర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పావురాల వల్ల వస్తున్నాయట.

బెంగళూరులో పావురాల కారణంగా ఓ రకమైన భయం ఏర్పడింది. ఎందుకంటే మానవులలో హైపర్‌సెన్సిటివిటీ న్యుమోనైటిస్ (HP), ఇతర ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. పలువురు వైద్యులు పావురాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయమని అంగీకరిస్తున్నారు. ప్రజల్లో విస్తృతంగా అవగాహన లేకపోవడం వల్ల హెచ్‌పి, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కేసులు పెరగడానికి పావురాల మలం ప్రధాన కారణమని పల్మోనాలజిస్టులు చెబుతున్నారు.

feeding pigeons

ఎప్పుడో ఒకసారి.. పావురాల వద్దకు, వాటి రెట్టల వద్దకు వెళ్తే హెచ్‌పి రాదు. కానీ దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుందని అంటున్నారు. మీరు మీ ఇంటికి వచ్చే పావురాలకు క్రమం తప్పకుండా ఆహారం ఇస్తే అవి రెట్టలు మీ ఇంట్లో, చుట్టుపక్కలనే వేస్తాయి.. శ్వాస పీలుస్తున్నప్పుడు రెట్టల కారణంగా సమస్యలు వస్తాయి.

హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ లేదా బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్.. ఇది ఊపిరితిత్తులకు వచ్చే అలెర్జీ. పావురాల వదిలే రెట్టలతో వచ్చే వ్యాధి. నిమోనియాకు దగ్గరగా లక్షణాలు ఉంటాయి. ఈ అలెర్జీతో జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు, శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పావురాల మూత్రం, మలం కలిపి ఒకేసారి విసర్జిస్తాయి. ఇది మనకు చాలా ప్రమాదకరం. రెట్ట ఎండిపోయాక.. కణాలుగా గాలిలో కలిసి పోతాయి. గింజలు వేసేందుకు వెళ్లిన వారికి శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. అలెర్జీకి, ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతుంది. అది ముదిరి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయి. పావురాలకు ఆహారం ఇవ్వడం మానేయడం, అవి ఉన్న చోటికి వెళ్లకుండా ఉండటం ఉత్తమ చికిత్స అని వైద్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news