ఈరోజు నేషనల్‌ బాయ్‌ఫ్రెండ్‌ డే.. మంచి బాయ్‌ ఫ్రెండ్‌ అంటే ఎలా ఉండాలో తెలుసా..?

-

ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్‌ ఉంటుంది. ఈరోజు స్పెషల్‌ ఏంటో తెలుసా..? బాయ్‌ ఫ్రెండ్‌ డే అట ఈరోజు. గర్ల్‌ఫ్రెండ్‌ డేను ప్రతిసంవత్సరం ఆగస్టు 1న జరుపుకుంటారు. అలాగో అక్టోబర్‌ 3న బాయ్‌ఫ్రెండ్‌ జరుపుకుంటారు. మీ బాయ్‌ఫ్రెండ్ లేదా భర్తతో మీ మనసులోని మాటను చెప్పడానికి ఇదే మంచి అవకాశం. బహుమతి లేదా సందేశం ద్వారా మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి తెలియజేయవచ్చు. అసలు మంచి బాయ్‌ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి..?

జాతీయ బాయ్‌ఫ్రెండ్ డే చరిత్ర:

2014లో తొలిసారిగా బాయ్‌ఫ్రెండ్ డే జరుపుకున్నారు. అయితే ఇది అధికారికంగా 2016లో ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3న 45 వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి. 2016 తర్వాత, నేషనల్ బాయ్‌ఫ్రెండ్ డే వేడుక అధికారికంగా చేస్తున్నారు. ఇది మొదట యునైటెడ్ స్టేట్స్లో స్టాట్‌ చేశారు. ఇప్పుడు మెల్లమెల్లగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతోంది.

ఈ రోజున అమ్మాయిలు తమ ప్రియుడితో కలిసి ఉండాలని కోరుకుంటారు. వారికి తన ప్రేమను తెలియజేస్తారు. తమ జీవితంలో తమకంటూ ప్రత్యేక స్థానం ఉందని తెలియజేసేందుకు ఈ రోజును జరుపుకుంటారు.

బాయ్‌ఫ్రెండ్ ఎలా ఉండాలి? :

ప్రియుడు అంటే ప్రేమికుడు. అయితే మీ బాయ్‌ఫ్రెండ్ మీ స్నేహితుడు కావడం కూడా ముఖ్యం. అతను అన్ని పరిస్థితులలో మీతో ఉండాలి. కాబట్టి బాయ్‌ఫ్రెండ్‌ని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు గమనించాలి.

కేరింగ్ బాయ్‌ఫ్రెండ్: మీ జీవితంలో మీకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిని కలిగి ఉండటం చాలా మంచిది. అతను మీ కోరికలు, కలలను గౌరవించే వ్యక్తిగా ఉండాలి. అతను ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచించే వారై ఉండాలి. అతను మీ తల్లిదండ్రులను, కుటుంబాన్ని, స్నేహితులను గౌరవించే స్వభావం కలిగి ఉండాలి.

రొమాంటిక్ బాయ్‌ఫ్రెండ్: ఏదైనా సంబంధం బలంగా ఉండాలంటే రొమాన్స్ చాలా ముఖ్యం. మీకు మానసికంగా, శారీరకంగా శృంగారభరితమైన బాయ్‌ఫ్రెండ్ ఉంటే, మీ జీవితంలో ఎప్పుడూ కొత్తదనం ఉంటుంది.

ఫన్నీ పర్సనాలిటీ: ఎప్పుడూ ముఖం చిట్లించి తిరిగే వ్యక్తితో జీవించడం కష్టం. జోకులు వేసి, బాధలో ఉన్నప్పుడు నవ్వించే, చుట్టుపక్కల వారి సంతోషాన్ని కోరుకునే బాయ్ ఫ్రెండ్ ఉంటే లైఫ్ ఫుల్ హ్యాపీగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news