చాలా కాలం నుండి పెళ్లి కుదరడం లేదా..? అయితే పెళ్లి త్వరగా అవ్వాలంటే ఈ పద్దతులను పాటించండి..!

చాలా కాలం నుండి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కుదరడం లేదా..? ఎన్నో వాటిని అనుసరిస్తున్నా ఫలించలేద..? అయితే పెళ్లి త్వరగా అయిపోవాలంటే జోతీష్యులు చెబుతున్న చిట్కాలని పాటించండి. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా త్వరగా పెళ్లి అయ్యిపోతుంది. అయితే పెళ్లి అవ్వకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి.

The great Indian marriage: Over 25 lakh weddings expected to generate ₹3 lakh cr in just one month, says CAIT

వాటిలో ఒకటి గ్రహాల పొజిషన్ అని చెప్పొచ్చు. దీని కారణంగా పెళ్లి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే పెళ్లి త్వరగా అవ్వాలంటే వీటిని పాటించండి. దీనితో త్వరగా పెళ్లి అయిపోతుంది. మీ సమస్య తీరిపోతుంది.

పసుపును ఎక్కువగా వాడండి:

పసుపు ఎక్కువగా వాడటం వల్ల త్వరగా పెళ్లి అయిపోతుంది. మీరు తీసుకునే ఆహారంలో కూడా పసుపుని వాడండి. పసుపు పాలు, పసుపుతో పరాటాలు ఇలా పసుపుని వాడటం వల్ల పెళ్లి అయిపోతుంది.

సుగంధ ద్రవ్యాలు:

మంచి సెంట్ వంటివాటిని వాడండి. ప్రతిరోజూ స్నానం చెయ్యండి. అలానే మంచి సెంట్ వంటివి ఉపయోగించండి.

దానం చేయడం:

పేద ఆడపిల్లలకు వివాహం జరిగినప్పుడు మీరు ఎంతో కొంత సహాయం చేయడం. లేదు అంటే బట్టలు, డబ్బులు వంటివి ఇవ్వడం లాంటివి చేయండి. ఇలా చేయడం వల్ల కూడా త్వరగా పెళ్లి అవుతుంది.

నవ గ్రహాలను పూజించడం:

నవగ్రహాలను పూజించడం వల్ల కూడా త్వరగా పెళ్లి అవుతుంది. మీకు దగ్గరలో ఉండే శని దేవుడు ఆలయానికి వెళితే పూజ చేసుకోవచ్చు. దీనితో కూడా పెళ్లి త్వరగా అవుతుంది.

గురువారం నాడు ఆవులకి ఆహారం ఇవ్వడం:

7 గురువారాలు ఆవులకి అరటిపళ్ళు, బెల్లం ఇలా ఏదైనా ఆహార పదార్థాలను పెడితే కూడా వివాహం త్వరగా అవుతుంది.