ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. దాంతో తీవ్ర ఆస్తి పంట మరియు ప్రాణనష్టం వాటిల్లింది.ఇదిలా ఉండగానే మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. దాంతో ఈరోజు రేపు కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
అదే విధంగా ఎల్లుండి సైతం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తరకోస్తాంధ్ర ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమలో సైతం ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక ఇప్పటికే వర్షాలతో ఏపీ ప్రజలు వనికిపోతుంటే మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు.