ఇక‌పై హ్యాంగోవ‌ర్ లీవ్ అధికారికం.. పీక‌ల‌దాకా మద్యం సేవిస్తే ఆ లీవ్ పెట్ట‌వ‌చ్చు..!

-

జ‌ర్మ‌నీలో మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల హ్యాంగోవ‌ర్ వ‌స్తే దాన్ని అనారోగ్యంగా ప‌రిగ‌ణించాల‌ని, ఆ వ్య‌క్తి ఉద్యోగి అయితే అతనికి కంపెనీ క‌చ్చితంగా సెల‌వు ఇవ్వాల్సిందేన‌ని ఆ దేశ కోర్టు తీర్పు చెప్పింది.

పార్టీల‌న‌గానే చాలా మంది మ‌ద్యం సేవించేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. ఇక మ‌ద్యం తాగ‌ని వారు భిన్న రుచుల ఆహారాల‌ను తినేందుకు ఆస‌క్తి చూపిస్తారు. పార్టీల్లో సాధార‌ణంగా మందు, విందు రెండూ ఉంటాయి. అయితే పార్టీల‌లో చాలా మంది పీక‌ల‌దాకా మ‌ద్యం సేవించ‌డం, మ‌రుసటి రోజు హ్యాంగోవ‌ర్‌తో బాధ‌ప‌డ‌డం మామూలే. ఈ క్ర‌మంలో ఉద్యోగులు అయితే ఆఫీసుల్లో లీవులు పెట్టేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే ఈ విష‌యంలో జ‌ర్మ‌నీ వాసులు అదృష్ట‌వంతుల‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే..?

now germans can get hang over leave officially

జ‌ర్మ‌నీలో మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల హ్యాంగోవ‌ర్ వ‌స్తే దాన్ని అనారోగ్యంగా ప‌రిగ‌ణించాల‌ని, ఆ వ్య‌క్తి ఉద్యోగి అయితే అతనికి కంపెనీ క‌చ్చితంగా సెల‌వు ఇవ్వాల్సిందేన‌ని ఆ దేశ కోర్టు తీర్పు చెప్పింది. ఇటీవ‌ల అక్క‌డి మ్యూనిచ్‌లో పెద్ద ఎత్తున జ‌రిగిన అక్టోబీర్ ఫెస్టివ‌ల్ త‌రువాత పెద్ద ఎత్తున హ్యాంగోవ‌ర్ల‌కు గురైన చాలా మంది స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఆ కోర్టు ఈ తీర్పు చెప్పింది. దీంతో ఇక ఆ దేశంలో మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల హ్యాంగోవ‌ర్ వ‌స్తే అందుకు సెల‌వు క‌చ్చితంగా ఇస్తార‌న్న‌మాట‌. దీన్నే వారు హ్యాంగోవ‌ర్ లీవ్ అని పిలుస్తున్నారు.

సాధార‌ణంగా ఎక్క‌డైనా సిక్ లీవ్ ఉంటుంది కానీ.. జ‌ర్మ‌నీలో ఇక ఆ లీవ్‌ను హ్యాంగోవ‌ర్ లీవ్ అని వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అక్కడి కోర్టు ఇటీవ‌లే తీర్పునిచ్చిన నేప‌థ్యంలో ఇక‌పై అక్క‌డి మ‌ద్యం ప్రియుల‌కు ఆ తీర్పు వారి గొంతులో ఆల్క‌హాల్ పోసినంత కిక్కిచ్చింది. దీంతో వారు పండ‌గ చేసుకుంటున్నారు. అవును మ‌రి.. ఈ విష‌యంలో జ‌ర్మ‌న్‌ల‌ను నిజంగా ల‌క్కీ పీపుల్ అనే చెప్పాలి..!

Read more RELATED
Recommended to you

Latest news