ఏపీలోని ‘అమ్మ ఒడి’ పథకానికి మరో నిబంధన..

-

వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్న ‘అమ్మఒడి’ పథకానికి ప్రభుత్వం మరో ఆంక్ష విధించింది. ఈ పథకం కింద విద్యార్థి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడికి విద్యా సాయం కింద ఏడాదికి రూ. 15 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. 1 వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు (కుటుంబంలో ఒకరికి మాత్రమే) ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.

అలాగే ఖ‌చ్చితంగా ఆ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. విద్యార్థులకు ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్యూ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు. తాజాగా ఈ పథకానికి సంబంధించి మరో షరతును విధించారు. 75 శాతం హాజరు కలిగిన విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. విద్యాసంవత్సరం మధ్యలోనే చదువును నిలిపివేస్తే.. సదరు విద్యార్థులను ఈ పథకం నుంచి తొలగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news