న్యూమరాలజీ ప్రకారం ప్రేమ, రిలేషన్ షిప్స్ గురించి తెలుసుకోండి..!

మీరు జన్మించిన తేదీ ఆధారంగా మీ ప్రేమ గురించి, మీ రిలేషన్ షిప్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు జన్మించిన తేదీ 14 అయితే ఈ రెండిటినీ కూడండి. అంటే 1+4=5 అంటే మీరు ఐదుని చూసుకోవాలి. ఇక్కడ ఏ అంకె వారికి ఎలాంటి ప్రేమ, ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది అనేది మనం చూడొచ్చు. మరి ఇక దీని కోసం ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తిగా చూసేయండి.

 

Numerology And Marriage

న్యూమరాలజీ ప్రకారం ప్రేమ, సెక్స్ మరియు రిలేషన్ షిప్ వివరాలు:

నెంబర్ వన్:

ఎంతో బాగా వీళ్ళు ఇతరులని ఆకట్టుకోగలరు. వీళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఏదైనా నిర్ణయాన్ని బాగా తీసుకోగలుగుతారు. ఎక్కువగా వీళ్ళు చిన్ననాటి స్నేహితులు ని వివాహం చేసుకుంటారు. వీళ్లు ఎప్పుడూ కూడా దేనికి కాంప్రమైజ్ అవ్వరు. వీళ్ళని ఎవరైనా ప్రేమించమని ఒత్తిడి చేసినా వీళ్ళు ప్రేమించరు. వీళ్ళకి 2,4,6 వాళ్ళు మంచి పార్ట్నర్స్. 7, 8, 9 పార్ట్నర్స్ అయితే అస్సలు సెట్ అవ్వరు.

రెండు:

వీళ్ళు చాలా ఎమోషనల్ గా సెన్సిటివ్ గా ఉంటారు. ప్రేమ మరియు ఫ్యామిలీ మీద ఫోకస్ ఎక్కువ పెడతారు. ప్రేమ, పెళ్లి, రిలేషన్షిప్ అనే విషయానికి వస్తే వీళ్ళు వాళ్ళ యొక్క హృదయం మాట వింటారు. పార్ట్నర్ ని వీళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. ఎమోషనల్ గా ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు. 1,3,6 వీళ్ళకి బాగా సెట్ అవుతారు. 5,8 అస్సలు బాగోదు.

మూడు:

మూడవ అంకె వాళ్ళు ప్రాక్టికల్ గా ఉంటారు. ఇతరుల కంటే కూడా వాళ్ళు వాళ్ళని ప్రేమిస్తారు. రొమాంటిక్ గా ఉండరు. ఎప్పుడూ కూడా టాప్ లో ఉండాలని అనుకుంటారు. వీళ్ళకి 2,6,9 వాళ్లు బాగా సెట్ అవుతారు. 1,4 వాళ్ళు సెట్ అవ్వరు.

నాలుగు:

సెక్స్ కోసం రిలేషన్ షిప్ లో ఉంటారు. అయితే అందరు ఇలా వుండరు. 22 వ తారీఖు పుట్టిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత భాగస్వామితో చాలా నెమ్మదిగా, లాయల్ గా ఉంటారు. ఆలానే ఎక్కువ మంది బాగా డామినేటింగ్ గా ఉంటారు. వీళ్ళకి 1,2,7,8 వాళ్ళు సూట్ అవుతారు. 4 అస్సలు సూట్ అవ్వదు.

ఐదు:

నెంబర్ ఫైవ్ వాళ్ళకి సెక్స్ అంటే చాలా ముఖ్యం. సెక్స్ లైఫ్ లో చాలా ఎక్స్పరిమెంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి 5,8 వాళ్లు సూట్ అవుతారు. నెంబర్ 2 వాళ్ళు అస్సలు సూట్ అవరు.

ఆరు:

ఆరవ అంటే వాళ్ళు ప్రేమగా, శాంతంగా ఉంటారు. ఎమోషనల్ రిలేషన్ షిప్ మరియు ఫిజికల్ రిలేషన్ షిప్ కూడా వీళ్ళకి చాలా ముఖ్యం. ఆరవ అంకె వాళ్ళు ఫోర్ ప్లే లో దిట్ట. ఆలానే ప్రేమని పంచడంలో ముందుంటారు. ఎవరినైనా ఇట్టే ఫిదా చేసేస్తారు. అయితే వీళ్ళకి అందరూ సెట్ అయిపోతారు.

ఏడు:

వీళ్ళు చాలా రొమాంటిక్ గా ఉంటారు. కెరీర్లో కూడా మంచి సక్సెస్ ని అందుకుంటారు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. నెమ్మదిగా వాళ్ళ పార్ట్నర్ తో మాట్లాడి గొడవలు అన్నిటిని కూడా తగ్గించేస్తారు. వీళ్ళకి రెండవ అంకె వాళ్ళు బెస్ట్. 9 అయితే అస్సలు సెట్ కాదు.

ఎనిమిది:

వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుని రిలేషన్షిప్ లో బాధ పడతారు, ముఖ్యంగా ఈ అంకె మహిళలు ఇబ్బంది పడతారు. వీళ్ళు నెంబర్ 8 వాళ్లనే పెళ్లి చేసుకుంటే మంచిది. రెండవ అంకె వాళ్ళు అస్సలు సెట్ అవ్వరు.

తొమ్మిది:

తొమ్మిదో అంకె వాళ్ళు చాలా డామినేటింగ్ గా ఉంటారు. వీళ్ళకి సెక్స్ అనేది చాలా ముఖ్యం అన్నిటి కంటే కూడా వీళ్ళు దానికి ప్రయారిటీ ఇస్తారు. ఈ అంకె వాళ్ళకి 6 చాలా బాగుంటుంది 1,9 అస్సలు సెట్ అవ్వదు.