పాత సామాన్లతో సరి కొత్తగా..!

-

సాధారణంగా మన ఇళ్ళల్లో అనేక పాత సామాన్లు ఉంటూ ఉంటాయి. పాత వాటర్ బాటిల్స్ నుండి పాత కుర్చీలు వరకు ఎన్నో వాటిని మనం తీసుకుని ఎంతో క్రియేటివ్ గా వాటిని తిరిగి ఉపయోగించవచ్చు. గార్డెనింగ్ అనేది నిజంగా మెయింటైన్ చేయడం చాలా కష్టం. వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలి. అయితే ఎప్పుడైతే పాత సామాన్లుని గార్డెనింగ్ లో ఉపయోగిస్తామో అప్పుడు మీరు ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తోనే అందమైన గార్డెన్ మీరు మీ ఇంట్లో రూపొందించవచ్చు. అదేంటి ఎలాగా అని అనుకుంటున్నారా..? మరి గార్డెనింగ్ టిప్స్ కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

ప్లాస్టిక్ బాటిల్స్:

మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కనిపిస్తుంటాయి. ప్లాస్టిక్ బాటిల్స్ ని ఏం చేయాలి అంటే వాటిని మధ్యకి కట్ చేసి దానిలో మట్టి పోసి ఏమైనా మొక్కని నాటవచ్చు. ఎక్స్ట్రా వాటర్ పోవడానికి క్యాప్ దగ్గర చిన్న రంధ్రం పెడితే ఎక్స్ట్రా వాటర్ పోతాయి. మీరు కావాలంటే ప్లాస్టిక్ బాటిల్స్ కి తాడు కట్టి హ్యాంగ్ చెయ్యొచ్చు. లేదంటే బాటిల్ కి పెయింట్ కూడా వేయొచ్చు ఇలా బాటిల్స్ తో ఎంతో క్రియేటివ్ గా చేసి మొక్కల్ని పెంచొచ్చు.

పాత కుర్చీలు, టేబుల్స్ :

మన ఇంట్లో పాత కుర్చీలు పాత టేబుల్స్ లాంటివి ఉంటాయి. అయితే విరిగిపోయిన వాటిని కూడా గార్డెనింగ్ లో మనం ఉపయోగించొచ్చు. ముందుగా మంచి రంగు వేసి వాటి మీద మొక్కలు పేర్చితే చాలు. ఎంతో యూనిక్ గా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఇలా మీరు కోకోకోలా బాటిల్స్ ని, పాత కర్టెన్స్ ని, ఫిష్ బౌల్స్ ని, షూ మొదలైనవి కూడా ఉపయోగించవచ్చు

Read more RELATED
Recommended to you

Latest news