దంపుడు బియ్యంలో పోషకాలెక్కువే..!

-

కొందరూ ఎంతో తిన్నా.. ఎన్ని వంటకాలు తిన్నా.. అరే లాస్ట్ లో గడ్డ పెరుగుతో లేదా పప్పుతోనైనా కొంచెం అన్నం తింటే బాగుండూ అని అనుకుంటారు. అవును నిజమే ఇది. చాలా మందికి అన్నమే ప్రధాన ఆహారమని చెప్పుకోవచ్చు. సామాన్య, మధ్య తరగతుల ఇళ్లలో ఎక్కువగా కనిపించేది ఇదే. ఇప్పుడంతా పాలిష్ చేసినా బియ్యంతో తెల్లగా ఉంటే అన్నంను తింటున్నారు కానీ, ఒకప్పుడు వడ్లపై పొట్టు తీసేందుకు మిషిన్లు అందుబాటులోకి రాలేవు. మన తాతలు, ముత్తాతలు బియ్యాన్ని రోకలిలో దంచి దంపుడు బియ్యాన్ని తినేవాళ్లు. పాలిష్ బియ్యం కంటే దంపుడు బియ్యంలో ఎక్కువ పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు, జబ్బులు బారిన పడకుండా ఉండేందుకు దంపుడు బియ్యం ఎంతో శ్రేయస్కరం. మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు దంపుడు బియ్యం ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

rice
rice

దంపుడు బియ్యంలో ఉండే పోషకాలు..

దంపుడు బియ్యం, పాలిష్ చేసిన బియ్యంలో కూడా పిండి పదార్థాలు ఎక్కువ. కొవ్వు పదార్థాలు ఉండవు. వంద గ్రాముల దంపుడు బియ్యంలో 1.8 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. అదే తెల్లబియ్యంలో కేవలం 0.4 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. థయమిన్ 5 శాతం, నియాసిన్ 8 శాతం, విటమిన్ బీ-67 శాతం, మాంగనీస్ 45 శాతం, మెగ్నీషియం 11 శాతం, పాస్ఫరస్ 8 శాతం, ఐరన్ 2 శాతం, జింక్ 4 శాతం ఉంటాయి.

100 గ్రాముల పాలిష్ బియ్యంలో పోషకాలు..

థయమిన్ 1 శాతం, నియాసిన్ 2 శాతం, మాంగనీస్ 24 శాతం, పాస్ఫరస్ 4 శాతం, విటమిన్ బీ6- 5 శాతం, మెగ్నీషియం 3 శాతం, ఐరన్ 1 శాతం, జింక్ 3 శాతం ఉంటాయి. పాలిష్ బియ్యం కంటే దంపుడు బియ్యంలోనే అధికంగా పోషకాలు ఉంటాయి.

మధుమేహంకు చెక్ పెట్టండిలా..

దంపుడు బియ్యంలో మెగ్నీషియం, పీచు అధికంగా దొరుకుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా దంపుడు బియ్యం తీసుకుంటే మధుమేహం ముప్పు 31 శాతం వరకు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే పాలిష్ బియ్యం ఎక్కువగా తీసుకునే వారిలో మధుమేహ ముప్పు ఎక్కువగా ఉంటుందని, దీనికి కారణం అందులో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) అన్నారు. పాలిష్ బియ్యంలో బీఐ 89 ఉంటే.. దంపుడు బియ్యంలో జీఐ 50 ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news