ప్రేమికుల రోజున అమ్మా నాన్నకు పూజ చేస్తారు అక్కడ…!

-

సాధారణంగా ప్రేమికుల రోజున ఎవరైనా ఎం చేస్తారు…? ప్రేమించిన అమ్మాయితో గడపడానికి ఇష్టపడతారు. లేదా భార్యతో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ రోజున ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇదే జరుగుతుంది. ఆ రోజు కోసం ఎంతో ఎదురు చూసి ప్రత్యేకంగా టూర్లకు వెళ్ళడం లేదా ఎక్కడైనా ఎంజాయ్ చేయడం వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా సరే ఇదే జరుగుతుంది.

కాని ఒక చోట మాత్రం అమ్మా నాన్నకు పూజ చేస్తారు. అవును మీరు చదివింది నిజం. గుజరాత్‌లోని సూరత్ జిల్లాలోని స్కూళ్లలో ప్రేమికుల రోజున తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సూరత్ జిల్లా విద్యాశాఖాధికారి దీనికి సంబంధించి స్కూళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. భారతీయ సాంస్కృతిక మూలాలు విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

దీనిపై ఇప్పుడు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాల్లో నిజాయితీ ఉంటే అర్ధవంతంగా ఉంటాయని అంటున్నారు. అయితే దీనిని గుజరాత్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతుంది. ఆరోజున విద్యార్థులు తమ తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకువచ్చి, వారికి పూజలు నిర్వహించి, మిఠాయిలు పంచిపెట్టాలని జారి చేసిన ఆదేశాలపై మాట్లాడిన కాంగ్రెస్ నేతలు, ఇది ఒక నాటకమని, కొత్త వివాదాలకు దారి తీస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news