ఇకనుంచి రైళ్లలోనూ షాపింగ్ చేసుకోవచ్చు..!

-

Onboard Shopping on Western Railway trains from january

అవును.. ఇక మీరు రైళ్లలో ప్రయాణిస్తూ హాపీగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అరె.. ఈ ఐడియా ఏదో బాగుందే అంటారా? అవును.. ఈ ఐడియాను అమలు చేస్తోంది వెస్టర్న్ రైల్వే డివిజన్.

ఇప్పటివరకు లగ్జరీ విమానాల్లో మాత్రమే షాపింగ్ సదుపాయం ఉంది. కానీ.. ఇప్పుడు రైళ్లలోనూ ప్రయాణికులు షాపింగ్ చేసుకోవచ్చు. దీనిపై వెస్టర్న్ రైల్వే ముంబై డివిజన్ ఓ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది.

ముందుగా రెండు రైళ్లలో ఈసదుపాయాన్ని తీసుకురానున్నారు. తర్వాత వేరే రైళ్లలో ప్రవేశపెడతారు. జనవరిలో మరో 16 రైళ్లలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఏసీ బోగీల్లో ఈ సేల్స్ ఎక్కువగా ఉండనున్నాయి. హాండ్ బ్యాగ్స్, పర్సులు, నెక్లెస్, వాచ్, గిఫ్ట్ ఐటెమ్స్, కాస్మొటిక్స్, గాడ్జెట్స్, ఇయర్ ఫోన్స్.. ఇలా పలు రకాల ఉత్పత్తులను రైళ్ల అమ్మనున్నారు. వాటి మీద డిస్కౌంట్ ప్రైస్ కూడా లభిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే ఐదేళ్లలో రూ. 3.66 కోట్లు సంపాదనను ఎక్స్ పెక్ట్ చేస్తోంది వెస్టర్న్ రైల్వే. ఇంకా ఏ ట్రెయిన్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందో డిసైడ్ చేయనప్పటికీ.. ముంబై-అహ్మదాబాద్ శతాబ్దిని కూడా ఆ లిస్ట్ లో చేర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news