
ఒక్కసారి కన్ను కొట్టింది. అంతే దేశమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. యువత మనసును కొల్లగొట్టింది. ఆమె ఎవరో మీకు ఇప్పటికే అర్థమయిపోయి ఉంటుంది. ప్రియా ప్రకాశ్ వారియర్ గురించే మాట్లాడేది. మలయాళం సినిమాలోని ఓ పాటలో ఉన్న ఓ సీన్ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. తను కన్నుకొట్టడం, గన్ లాంటి చేతితో కాల్చడం… కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టింది.
ఓవర్ నైట్ స్టార్ అవడంతో ప్రియాకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ లోనూ తనకు ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ లో ఓసినిమాలో ప్రస్తుతం తను నటిస్తోంది. ఇవన్నీ పక్కన బెడితే.. తన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే బాత్ టబ్ లో తీసిన ఫోటోషూట్ విపరీతంగా వైరలయిందా? అది కాస్త మరవకముందే మరో ఫోటోషూట్ తో మనముందుకు వచ్చింది ప్రియా. ఈసారి ఇంకాస్త వైల్డ్ గా కనిపిస్తోంది ప్రియా. ఆ ఫోటోలు చూసి నెటిజన్లు ప్రియాపై కాస్త ఫైరయ్యారు. ఏంటి ప్రియా.. ఇలా పిచ్చి పిచ్చి ఫోటోషూట్లు చేస్తున్నావు. కాస్త పద్ధతిగా ఉండు. నువ్వూ అందరిలా తయారవ్వకు అంటూ హితబోధ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రియా.. యూ ఆర్ లుకింగ్ గార్జియస్. సూపర్బ్ లుక్.. టెంప్టింగ్ లుక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.