సెప్టెంబర్ లో పుట్టిన వాళ్ళు ఈ విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉంటారట..!

మనకి మొత్తం 12 నెలలు. వీటిలో 9వ నెల సెప్టెంబర్. సెప్టెంబర్ నెల ఎంతో శక్తివంతమైనది. అదే విధంగా 9వ అంకె పవర్, పొజిషన్ మరియు జీవితంలో ప్లేస్మెంట్స్ ని సూచిస్తుంది. తొమ్మిది గ్రహాలు, నవరాత్రులు ఇలాంటివి మనం చూసుకుంటే తొమ్మిది ఎంత శక్తివంతమైనది అనేది మనకి తెలుస్తుంది. అయితే తొమ్మిదో నెల అయిన సెప్టెంబర్ లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు..?, వాళ్లలో ఎలాంటి గుణాలు ఉంటాయి..?, ఏ విషయాలలో పర్ఫెక్ట్గా ఉంటారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీనికోసం ఒక లుక్కేయండి.

 

సెప్టెంబర్ లో పుట్టిన వాళ్ళు చాలా కష్ట జీవులు. అలానే వీళ్ళు ఎంతో ట్యాలెంటెడ్. ఈ నెలలో పుట్టిన వాళ్ళు పర్ఫెక్షనిస్ట్ గా పుడతారు. ఎంత నెమ్మదిగా ఉంటారు. ఈ నెలలో పుట్టిన వాళ్ళు జీవితాంతం ఒకే వ్యక్తి తో ఉండాలని అనుకుంటారు. అలాగే వీళ్ళు ఎంతో క్రియేటివ్ గా ఉంటారు. వాళ్ళని వాళ్ళు ఎంతో బాగా తయారు చేసుకోగలుగుతారు. పైగా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండగలరు.

పని విషయంలో కూడా ఎంతో శ్రద్ధతో చేస్తారు. ఈ నెలలో పుట్టిన వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. వాళ్ల గురించి వాళ్లు ఇతరులతో ఎక్కువగా పంచుకోవాలని అనుకోరు. అదే విధంగా ఈ నెలలో పుట్టిన వాళ్ళు ఓడిపోయినా కూడా దానిని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరు. అయితే కొన్ని కొన్ని సార్లు అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనితో మానసికంగా మరియు ఎమోషనల్ గా కూడా కాస్త ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ కూడా ఎక్కువగా ఉంటుంది.

సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్లకి ఏ కెరీర్ బాగుంటుంది:

హెల్త్ ప్రొఫెషనల్ కింద వీళ్ళు బాగా రాణించగలరు. ఫార్మసిస్ట్, డెంటిస్ట్, డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ వంటివి వీళ్ళకి బాగుంటాయి. అలానే సైంటిస్ట్, ఇన్స్పెక్టర్, అనలిస్ట్, రైటర్, రీసెర్చ్ వర్కర్, లైబ్రేరియన్, ప్రూఫ్ రీడర్, మేనేజ్మెంట్ ట్రైనర్, క్రాఫ్ట్ పర్సన్, షాప్ అసిస్టెంట్, టీచర్, యోగా టీచర్ వంటివి కూడా వీళ్ళకి బాగుంటాయి.