దిండులతో కొట్టుకునే ఫైట్.. గెలిస్తే.. రూ.3.7 లక్షల ప్రైజ్ మనీ..!

-

ఇంట్లో అక్కాతుమ్ముళ్లు లేదా అక్కాచెళ్లెళ్లు దిండులతో కొట్టుకుంటారు. మనం కూడా చిన్నప్పుడు ఇలాంటి ఫైటింగ్ చేసే ఉంటాం. సినిమాల్లో కూడా సాంగ్స్ లో ఈ సీన్ పెడతారు.. కానీ దీన్నే ఒక గేమ్ గా పెడితే. సరదాగా గేమ్ కాదు.. గెలిస్తే.. ప్రైజ్ మనీ కూడా ఇస్తారట. నార్మల్ గా బాక్సింగ్ లో పాల్గొంటే.. గెలిచినా, ఓడినా ఒళ్లు మాత్రం హూనం అయిపోతుంది. కానీ ఈ ఫైట్ లో సుతిమెత్తని దెబ్బలు తినొచ్చు.

2021 జనవరి 29న అమెరికాలోని సముద్ర తీర రాష్ట్రం ఫ్లోరిడాలో… పిల్లో ఫైట్ ఛాంపియన్‌షిప్స్ (PFC) జరిగింది. మహిళా, పురుష అథ్లెట్లు వేర్వేరుగా బాక్సింగ్ రింగులో తలపడ్డారు..మగవాళ్లకు ఓ టైటిల్, లేడీస్ కి ఓ టైటిల్ ఉండగా… 16 మంది మగాళ్లు, 8 మంది స్త్రీలు పోటీపడ్డారు. అథ్లెట్లు మార్షల్ ఆర్ట్స్ ప్రయోగిస్తూ… ప్రత్యేకంగా తయారుచేసిన దిండులతో కొట్టేసుకున్నారు. దీన్ని పే పెర్ వ్యూ టోర్నమెంట్ లా నిర్వహించారు. దీన్ని చూడాలనుకునేవారు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఒక్కో విజేతకూ $5,000 (సుమారు రూ.3.73 లక్షలు) ఇచ్చారు. అలాగే బెల్ట్ కూడా ఇచ్చారు. మహిళల కేటగిరీలో బ్రెజిల్ కి చెందిన ఇస్టెలా నూన్స్… అమెరికాకి చెందిన కెండాల్ వోకెర్ ను ఓడించింది. మగవారి కేటగిరీలో అమెరికాకి చెందిన హాలీ తిల్ మాన్ మార్కస్ బ్రిమేజ్ ని ఓడించాడు.

ప్రత్యర్థులు బలంగానే కొట్టేసుకున్నారు. దిండులతో విరుచుకుపడ్డారు. ఎవరికీ గాయాలు కాలేదు. బాక్సింగ్ అంటే..లేడీస్ కి చూడ్డానికి అసలు ఇష్టపడరు.. రక్తాలొచ్చేట్లు కొట్టుకుంటారు.. కానీ ఈ పిల్లో ఫైట్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు.. సరదా పోటీ కాస్తా ఇప్పుడు అఫీషియల్ గా మారడంతో… ఇకపై ఇలాంటివి మరిన్ని ఛాంపియన్‌షిప్ లు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణలు. దీని గురించి తెలిసిన కొేందరు నెటిజన్లు.. ఇక దీన్ని ఒలంపిక్స్ లో కూడా పెట్టమని కోరుతున్నారు. ఈ క్రీడకు మరితం పాపులార్టీ పెరుగుతుందని మరికొంతమంది అంటున్నారు. ఇంతకీ మీరు ఎప్పుడైనా పిల్లో ఫైట్ చేశారా..చిన్నప్పుడు అయితే అందరూ ఈ అల్లరి చేసే ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news