రీసెంట్ గా గూగుల్ ఓ వీడియో రిలీజ్ చేసింది తెలుసు కదా. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో గుడ్ అనే పదంతో ఉన్న వాక్యాలనే ఎక్కువగా ఉపయోగించారట. అందుకే.. యూజర్లు సెర్చ్ చేసిన కొన్ని వాక్యాలకు సంబంధించిన కొన్ని క్లిప్స్ ఆధారంగా గూగుల్ ఆ వీడియోను రిలీజ్ చేసింది. తాజాగా గూగుల్ ట్రెండ్స్ కు సంబంధించి మరో వార్త బయటికి వచ్చింది. అదేంటేంటే.. ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువగా ఏ సెలబ్రిటీ గురించి వెతికారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.
ఆ సెలబ్రిటీ ఎవరో కాదు.. కన్ను కొట్టిన సుందరి ప్రియా ప్రకాశ్ వారియర్. కేరళ భామ. ఒరు అదార్ లవ్ అనే మలయాళం సినిమాలో హీరోయిన్. ఆసినిమాలోకి ఓ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా. ఆ సీన్ లో ప్రియా.. ఓ వ్యక్తిని చూసి కన్ను కొట్టడం, గన్ తో పేల్చడం లాంటివి సోషల్ మీడియాను ఊపేశాయి కదా. నెటిజన్లు కూడా ఎక్కువగా ఆమె గురించే సెర్చ్ చేశారట. సెలబ్రిటీలలో ఎక్కువగా ఈమె గురించి ఎక్కువగా వెతికారట.
మోస్ట్ సెర్చ్ డ్ పర్సనాలిటీ ఇన్ ఇండియా ఆఫ్ ది ఇయర్ గా ప్రియా రికార్డు సృష్టించినట్టు గూగుల్ ఇండియా తెలిపింది. ప్రియా తర్వాత బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ సెకండ్ లిస్ట్ లో ఉండగా.. మూడో స్థానంలో సింగర్ సప్నా చౌదరి, ఐదో స్థానంలో సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహుజా నిలిచారు.