చరణ్ ఐటంగా బాలీవుడ్ భామ

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఐటం సాంగ్ కూడా ఉంటుందట. అయితే ఈ సాంగ్ లో నిన్నటిదాకా కేథరిన్ త్రెసా నర్తిస్తుందని వార్తలు రాగా లేటెస్ట్ గా ఈ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ పేరు వినపడుతుంది.

బీ టౌన్ హాట్ గాళ్ ఈషా గుప్తా చరణ్ తో స్పెషల్ సాంగ్ చేస్తుందట. సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఈషా టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఈ పాట క్లిక్ అయితే అమ్మడికి ఇక్కడ వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సాంగ్ కోసం ఆరెక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ను అడిగినా ఆమె నో చెప్పింది.

ఈమధ్య స్టార్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్ మీద దృష్టి పెట్టారు. కాజల్, తమన్నా, శృతి హాసన్ లు ఆల్రెడీ ఈ స్పెషల్ సాంగ్ చేసినవారే. మరి ఈషాతో చరణ్ చేసే ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు ప్లస్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news