రజినీ సార్ మీకు హేట్సాఫ్.. 2.0 లో రజినీ అవతారాలు చూశారా?

-

Rajinikanth making video of 2.0

రజినీ కాంత్.. ఆ పేరులోనే ఏదో మహత్తు ఉంది. ఆయన పేరు చెబితే సౌత్ ఇండియా ఇండస్ట్రీ మొత్తం కదిలిపోతుంది. ఆయన సౌత్ ఇండియా సూపర్ స్టార్ ఊరికే కాలేదు. దాని వెనుక ఎంతో కష్టం ఉంది. ఇప్పుడే కాదు.. ఎప్పుడైనా ఆయన సినిమాలో ప్యాషన్ తో నటిస్తారు. కాదు కాదు జీవిస్తారు. ఇప్పుడు రజినీ కాంత్ ను ఎందుకు పైకి లేపుతున్నారు అంటారా?

దానికి ఓ కారణం ఉంది. ఈనెల 29 న రజినీ కాంత్ నటించిన 2.0 సినిమా రిలీజ్ కానున్నది కదా. దీంతో ఆ సినిమా ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. సినిమా టీజర్, ట్రైలర్ ను ఇదివరకే రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. ఇటీవలే సినిమాలో అక్షయ్ పాత్ర మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. తాజాగా రజినీ కాంత్ ఆ సినిమా కోసం ఎలా మేకప్ వేసుకున్నారు.. ఎన్ని అవతరాలు వేశారో చెప్పడం కోసం ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.. ఆ వయసులో కూడా రజినీ కాంత్ అవతారాలు మార్చడానికి ఎంత కష్టపడ్డాడో. అందుకే రజినీ సార్ మీరు గ్రేట్. మీకు హేట్సాఫ్.

Read more RELATED
Recommended to you

Latest news