వైర‌ల్ వీడియో : రైతు ఇంట్లో రెండు తలల పాము.. ఆ త‌ర్వాత‌..

-

సాధార‌ణంగా రెండు త‌ల‌ల పాము అంటే ముందు ఒక తల, వెనుక తల ఉండేవి. వీటిని పల్లెటూర్లలో కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఒకవైపే రెండు తలలు ఉన్న పాములను ఎప్పుడూ చూసుండ‌రు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా చైనాలో రెండు తలల పాము కలకలం రేపింది. వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాలో షెన్‌జౌ ప్రాంతానికి చెందిన రైతు తన పొలంలో రెండు తలల పామును చూసి ఆశ్చర్యపోయాడు.

వెంటనే ఓ కుండను తీసుకుని పాముపై బోర్లించి బంధించాడు. అనంతరం దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. కొంతమంది నెటిజన్లు సరీసృపాలు చూసి షాక్ అవ్వగా, కొందరు దానిపై ఆకర్షితులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ పామును చూసేందుకు షెన్‌జౌ పొలంలో క్యూ కట్టారు.

అందరికి చూపించిన తర్వాత షెన్‌జౌ దాన్ని మళ్లీ కుండలో పెట్టేశాడు. అయితే, ఓ పిల్లాడు పొరపాటున కుండను పడేయడంతో పాము అక్కడి నుంచి తప్పించుకుంది. ఆ పాము సైజులో చాలా చిన్నదిగా ఉండటంతో ఎవరికీ కనిపించలేదు. అయితే ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news