విమానంలో అధికారులకు చుక్కలు చూపిస్తున్న ఎలుక… మూడు రోజులు అయినా…!

-

సాధారణంగా విమానం ప్రయాణానికి సిద్దమైనప్పుడు, సాంకేతికంగా ఏ సమస్యలు రాకుండా ఉండేందుకు గాను అధికారులు అన్ని విధాలుగా పరిశీలిస్తూ ఉంటారు. విమానంలో ఏ సమస్యలు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఒక విమానంలో ఎలుక మాత్రం కనపడకుండా పోయింది. అవును ఇది నిజం… ఒక ఎలుక ఎంత వెతికినా కనపడలేదు. ప్రయాణికులు ఎక్కే ముందు పరిక్షలు చేయగా విమానంలో ఎలుక ఉన్నట్టు గుర్తించారు.

ఇటీవల వారణాసి లే ఓవర్ సమయంలో కోల్‌కతా-డెహ్రాడూన్ ఎయిర్ ఇండియా విమానం 24 గంటలు ఆలస్యం అయింది, ఎందుకంటే విమానంలో ప్రయాణించే ఎలుక కోసం విమానయాన ఉద్యోగులు విమానాన్ని తనిఖీ చేస్తున్నారు కాబట్టి. జాతీయ మీడియా కథనం ప్రకారం… ఆ విమానంలో ఎలుక ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత దాన్ని వెతకడానికి విమాన సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేసారు.

ఒక సీనియర్ ఎయిర్ ఇండియా అధికారి మాట్లాడుతూ ఎలుకతో విమానం బయలుదేరలేదని, ఎందుకంటే అది ఏదైనా ప్రమాదానికి కారణం అయి అయ్యే అవకాశం ఉందని అచేప్పారు. తర్వాత ఢిల్లీ నుంచి ఇంజనీర్లను పిలిచినా సరే అది దొరకలేదు. విమానం లోపల పురుగుమందును పిచికారీ చేశారు. దీనితో విమానం దాదాపు 12 గంటలు పాటు ఆపేశారు. దీనితో ప్రయాణికులు వారణాసిలోని హోటల్స్ లో గడిపారు. అయితే ఆ ఎలుకను ఇప్పటి వరకు గుర్తించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news