సరదాగా మొదలేసిన ఒక అలవాటు నేడు ఎంతోమందిని అనారోగ్యానికి గురిచేస్తుంది. ఫ్రండ్స్ తాగుతున్నారనో, స్టైల్‌గా ఉంటుందనో, టెన్షన్ ఎక్కువగా ఉందనో సిగిరెట్ తాగుతారు. అది కాస్తా.. అలవాటుగా మారి.. డైలీ తాగాలనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడమగా అని తేడా లేకుండా.. పెద్ద సంఖ్యలో ఈ చెడు అలవాటుకు బానిసలవుతున్నారు. ప్రభుత్వాలు తాగొద్దని చెప్పడం తప్ప ఏం చేయలకేపోతున్నాయి. కానీ బ్రిటన్‌లో ఓ కొత్త కాన్సప్ట్ తీసుకొచ్చారు. ధూమపానం చేసేవారికి ఒక ఆఫర్ ఇచ్చారు..అదేంటంటే..!
స్మోకింగ్ పూర్తిగా మానేస్తే, వారికి బదులుగా డబ్బు ఇస్తారట.. ప్రస్తుతం ఈ పథకం UKలోని చెషైర్ ఈస్ట్ నగరంలో అమలులో ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇక్కడ పొగతాగే వారి సంఖ్య తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పొగతాగడం మానేసిన వారికి 20 వేలు, గర్భిణి మానుకుంటే రూ. 40 వేలు ఇస్తామని నగరంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం వల్ల ప్రజలు కచ్చితంగా మారతారని అధికార యంత్రాంగం భావిస్తోంది.
ఇలా గుర్తిస్తారు..
ఈ పథకం ప్రకారం.. 20, 40 వేల రూపాయల రివార్డును ప్రకటించారు, కానీ దానికి అర్హులు కావాలంటే.. ధూమపానం పూర్తిగా మానేసినట్లు వ్యసనపరులు నిరూపించాలి. ఒక వ్యక్తి ధూమపానం మానేసినట్లు చెప్పినప్పుడు.. అతడు లేదా ఆమె పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. వారు ఉచ్ఛ్వాస కార్బన్ మోనాక్సైడ్ పరీక్షలు చేస్తారు..అప్పుడే వారు ధూమపానం మానేసినట్లు రుజువు అవుతుంది. చెషైర్ ఈస్ట్‌లో 10.5 శాతం మంది పొగతాగుతున్నారు, ఇప్పుడు 10.8 శాతానికి చేరుకుంది. ఇందులో గర్భిణులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
ప్రజల ధూమపాన వ్యసనాన్ని వదిలించుకోవడానికి 116,500 యూరోలు అంటే భారతీయ కరెన్సీలో 10 మిలియన్లకు పైగా బడ్జెట్ ఆమోదించబడింది. ఇందులో నుండి ధూమపానం మానేసినందుకు ప్రతిఫలంగా ప్రజలకు డబ్బు ఇస్తున్నారు..కౌన్సిల్ నివేదిక ప్రకారం ధూమపానం మానేయాలనుకునే వారికి ఆర్థిక సహాయం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. నివేదిక ప్రకారం.. రోజుకు 20 మంది ధూమపానం చేసేవారు సంవత్సరానికి రూ. 4.4 లక్షలు ఖర్చు చేస్తారు. ధూమపానం మానేయడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఈస్ట్ చెషైర్‌లో ఈ పథకం సరైన ఫలితాలను ఇస్తే, ఇతర నగరాల్లో కూడా ఇది అమలు చేసే ఆలోచనలో ఉన్నారు.
మొత్తానికి ప్రజల ఆరోగ్యం కోసం..ప్రభుత్వం అలా చేస్తుంది. అయితే.. ఒకసారి డబ్బు తీసుకుని మళ్లీ పొగతాగరని గ్యారెంటీ ఏంటి..? దానికి తగ్గట్టుగా కూడా ప్రభుత్వం ఏదో ఒక ఆలోచన చేసే ఉంటుంది..!