రైస్ ఏటీఎం… ఎలా పని చేస్తుంది అంటే…!

-

కరోనా లాక్‌డౌన్‌ చాలా మందికి ఇప్పుడు నరకం చూపిస్తుంది. వేలాది మంది తిండి లేక అవస్థలు పడుతున్నారు. రోజు ఎలా గడుస్తుందో అర్ధం కాక నరకం చూసే పరిస్థితి, నిరుపేదలు వలస కూలీలు అందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందు లాక్ డౌన్ మినహా… మరో మార్గం కనపడటం లేదు. దీనిపై ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చాలా దేశాల్లో పేదలు ఇప్పుడు పూట గడవడానికి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఉంది. మన దేశంలో అయితే వలస కూలీలు సొంత ఊర్లకు వెళ్లిపోవాలి అని భావిస్తున్నారు. రైల్వే స్టేషన్ ల వద్ద భారీగా బారులు తీరారు. ఇక వియత్నాం విషయానికి వస్తే అక్కడ లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పేదలకు ఆహారం అందించడానికి గానూ అక్కడ ఒక వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు.

హోచిమిన్‌సిటీలో వ్యాపారి హోంగ్‌ టాన్‌ ఆన్‌ ఈ సమస్యకు 24 గంటలూ అందించేందుకు వీలుగా ఆయన బియ్యం ఏటీఎం కి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ప్రతీ ఒక్క పేద వ్యక్తికి రోజుకు కిలోన్నర బియ్యాన్ని ఉచితంగా అందించే విధంగా శ్రీకారం చుట్టాడు. వియత్నాంలోని ఇతర నగరాల్లోనూ పలువురు దాతలు రైస్‌ ఏటీఎంలను ఏర్పాటు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. వారికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news