సాధారణంగా వన్డే, టీ20 లేదా టెస్ట్ మ్యాచ్‌లలో ఎవరైనా కొత్త ప్లేయర్ అరంగేట్రం చేస్తే పరుగులు చేసేందుకు కొంత సమయం తీసుకుంటారు. అసలే.. కొత్త కదా.. అలాంటప్పుడు 0, 1 రన్స్‌కు అవుట్ అయితే బాగుండదు కదా. కనుక కొత్త ప్లేయర్లు ఎవరైనా పరుగులు చేసేందుకు కొంత సమయం పడుతుంది. అయితే… అందరు ప్లేయర్లు అలా ఉండరు కదా.. రిస్క్ తీసుకుని అయినా సరే.. తొలి మ్యాచ్‌లో తమదైన ముద్ర వేయాలని, అది తమకు జీవితాంతం గుర్తుండాలని అనుకుంటారు. సరిగ్గా అలా అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ మాత్రం.. తాను అరంగేట్రం చేసిన తొలి టెస్ట్‌లోనే తాను ఆడిన రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు, అటు ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు కూడా షాక్ అయ్యారు.
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం విదితమే. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో దారుణ ఓటమి పాలవ్వగా, ప్రస్తుతం ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా 3వ టెస్టు ఆడుతోంది. తొలి రోజు భారత్ 6 వికెట్ల నష్టానికి 87 ఓవర్లలో 307 పరుగులు చేసింది. అయితే మూడో టెస్ట్‌లో ఐపీఎల్ స్టార్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కు చోటు దక్కింది. దీంతో పంత్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేంట్రం చేశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కొంత ముందు పంత్ క్రీజులోకి వచ్చాడు.
అయితే సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలోకి అరంగేట్రం చేసే ఏ ప్లేయర్ అయినా కొంత స్లోగా ఆడతాడు. కానీ పంత్ అలా కాదు. వన్డే మ్యాచ్ ఆడినట్లు ఆడాడు. టెస్టుల్లో తాను ఆడిన రెండో బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో పంత్ సిక్స్ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా ఇంగ్లండ్ ప్లేయర్లతోపాటు భారత అభిమానులు కూడా షాకయ్యారు. ఇక బౌలర్ ఆదిల్ రషీద్‌కు అయితే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కాగా ప్రస్తుతం పంత్ కొట్టిన ఆ సిక్సర్ వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై అనేక మంది ఫన్నీగా స్పందిస్తున్నారు కూడా..! కావాలంటే మీరు ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేయవచ్చు..!
Rishabh Pant to miss the next match after being awarded 4 demerit points for that insult shot off his second ball in test cricket. Adil Rashid delivers a viral worthy gif face. #ENGvIND #INDvENG #Trentbridgetest #RishabhPant #adilrashid pic.twitter.com/YIMLKVChCP
— Marirs Malahcatiknev (@SriramVenkit) August 18, 2018