‘ఉప్పు’ను ఆ ప్రదేశంలో పెడితే ఏం జరుగుతుందో తెలుసా?

-

ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పు లేని కూర.. ఉప్పులేని భోజనం చెయ్యడం అనేది జరగదు. ఏది ఉన్న లేకున్నా ఉప్పు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎంత మంచి వంట చేసినా కూడా తగినంత ఉప్పు లేకపోతే ఆ వంట వ్యర్థమే. మరి అలాంటి ఉప్పు కేవలం వంటలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ ఉప్పు వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయ్. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం…

ఉప్పు వంటకు రుచిని తీసుకురావడమే కాదు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని కూడా తొలిగిస్తుంది. అంతేకాదు వాస్తు దోషాలను కూడా నివారిస్తుంది.

ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొద్దిగా నీళ్ళలో ఉప్పు కలుపుకొని ఇంటిని శుభ్రం చేయడం ద్వారా మూలలో ఉన్న మురికి పోవడమే కాకుండా, మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది.

అలాగే ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని దానిలో కొంచెం ఉప్పు కలిపి నైరుతి మూలన పెడితే, మన ఇంట్లో ఉన్న అష్ట దరిద్రం తొలగిపోతుంది. ఇలా రోజూ నీటిని మారుస్తూ ఉండాలి.

బాత్రూంలో కూడా ఒక సీసా నీటిలో ఉప్పు వేసి ఉంచాలి. ఇలా చేయడం ద్వారా మన ఇంట్లో ఉన్న ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి.

ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలినట్టు అనిపిస్తే గుప్పెడు ఉప్పు తీసుకొని, వారిపై మూడుసార్లు తిప్పి పడేయడం మనం చూస్తూ ఉంటాం.

పడుకునే ముందు చిటికెడు ఉప్పు నీళ్ళలో కలుపుకొని కాళ్లు, చేతులు కడుక్కుంటే సుఖనిద్ర పట్టడమే కాకుండా అంతా మంచి జరుగుతుంది.

వారానికి ఒకసారైనా నీటిలో చిటికెడు ఉప్పు వేసి పిల్లలకు స్నానం చేయిస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు.

అయితే ఎంతోమంది ఇవన్నీ మూడ నమ్మకాలు అని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ ఇది ముమ్మాటికీ నిజం అని శాస్త్రం కూడా చెప్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news