అక్కడ పారిశుద్ధ్య కార్మికులకు గంటకు రూ.3 వేలు పైనే..నెలకు రూ. లక్షల్లో జీతం..!

-

పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్‌ చేసి నెలకు కనీసం జీతం ఇవ్వాలని మన దగ్గర కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. కానీ అక్కడ పారిశుద్ధ్య కార్మికలకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారట. మాములు జాబ్‌ చేసే వారికంటే..ఇలా శానిటేషన్‌ వర్క్‌ చేసే వాళ్లే ఎక్కువ సంపాదిస్తారట.. ఎందుకంత జీతాలు వాళ్లకు ఇస్తున్నారు, ఇంతకీ ఎక్కడ అది..?

ఆస్ట్రేలియాలో పారిశుద్ధ్య కార్మికుల కొరత చాలా ఎక్కువగా ఉంది.. ఆ పని చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయట. ఈ క్రమంలోనే పలు కంపెనీలు అధిక జీతం ఇచ్చి అయినా సరే పని మనుషులను పెట్టుకుంటున్నారు. లక్షల్లో చెల్లిస్తూ.. ఇళ్లు, ఆఫీసు ఊడ్చడం, తుడవడం వంటి పనులు చేయిస్తున్నారు.. అలాగే మరికొన్ని కంపెనీలు గంటల ప్రాతిపదికన కూడా భారీ జీతాలను చెల్లిస్తున్నాయి. అందుకే ఆస్ట్రేలియాలో కార్మికులు ప్రతి నెల సగటున 8 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారట.. సంవత్సరానికి 72 లక్షల నుంచి 80 లక్షల వరకు డబ్బు సంపాదిస్తున్నారు. వామ్మో సచ్చిదంకా చదువుకుని నాన తంటాలు పడుతూ ఉద్యోగాలు చేస్తున్న మనకు కూడా అంత రావడం లేదని మీకు కూడా అనిపించింది కదా..! ఆ పైసలు చూస్తే కామన్‌ ఫీలింగ్‌ అదే ఉంటదిలేండి.!

గంటకు 3 వేల పైనే…

సిడ్నీకి చెందిన క్లీనింగ్ కెంపనీ అబ్సొల్యూట్ డొమెస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ జో వెస్ మాట్లాడుతూ… క్లీనింగ్ చేసే వారు దొరక్క గంటకు 45 డాలర్లు ఇస్తూ మనుషులను పెట్టుకోవాల్సి వస్తుందట. అంటే మన కరెన్సీలో 3600 రూపాయలు. 2021 నుంచి ఆస్ట్రేలియాలో పారిశుద్ధ్య కార్మికుల కోటా కొనసాగుతోంది. ఏడాది క్రితం గంటకు 2700 ఇచ్చేవారట. కానీ ఇప్పుడు 3500 నుంచి 3600 వరకు ఇవ్వాల్సి వస్తోందట. కొన్ని కంపెనీలు అయితే 4700 రూపాయలు చెల్లించేందుకు కూడా వెనకడుగు వేయట్లేదట.

అలా అక్కడ పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులు ఏడాదికి 98 లక్షల వరకు సంపాదిస్తున్నారట. కొందరికి అయితే కోటి రూపాయలు కూడా దాటుతోందని అంచనా…ఆఫీసుల్లో కిటీకులు, టేబుళ్లు శుభ్రం చేస్తూ లక్షలు వెనకేస్తున్నారు. ఇదేదో బాగుందే..మనం కూడా వెళ్తే బాగా డబ్బులు సంపాదించొచ్చు అనుకుంటున్నారా ఏంటి..?

Read more RELATED
Recommended to you

Latest news