ఆ జిల్లాలో కారు-కాంగ్రెస్ హోరాహోరీ?

-

టీఆర్ఎస్ పార్టీకి మొదట నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పట్టున్న విషయం తెలిసిందే…ఇక గత రెండు ఎన్నికల్లో వరంగల్ జిల్లా ప్రజలు టీఆర్ఎస్ ని ఆదరించారు. గత ఎన్నికల్లో వన్ సైడ్ గా టీఆర్ఎస్ ని గెలిపించారు. జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉండగా, టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంది. కానీ తర్వాత ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ వైపు వచ్చారు. దీంతో టీఆర్ఎస్ బలం 11కు పెరిగింది.

అయితే రెండోసారి అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది..ఇదే సమయంలో జిల్లాలో కాంగ్రెస్ బలం కూడా పెరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు…దీంతో టీఆర్ఎస్ కు కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి పోటీగా కాంగ్రెస్ ఎదుగుతూ వస్తుంది.

అదే సమయంలో ఇక్కడ బీజేపీ కూడా పికప్ అవుతుంది…కాకపోతే బీజేపీ ప్రభావం రెండు, మూడు స్థానాల్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉండి…టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుంది. ఈ మధ్య వచ్చిన సర్వేల్లో కూడా అదే తేలింది. జిల్లాలో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

జిల్లాలో ఐదు సీట్లలో టీఆర్ఎస్ బలంగా ఉండగా, నాలుగు సీట్లలో కాంగ్రెస్ బలంగా ఉంది…ఇక మూడు స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉంది. అలా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న స్థానాలు వచ్చి…నర్సంపేట, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ స్థానాలు..ఇటు కాంగ్రెస్ కు వచ్చి…ములుగు, పరకాల, డోర్నకల్, మహబూబాబాద్ సీట్లు.

అయితే జనగాం, భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్ స్థానాల్లో టఫ్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో నర్సంపేట, వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో బీజేపీ కాస్త బలంగా ఉంది. మొత్తానికైతే వరంగల్ లో కారు..కాంగ్రెస్ పార్టీల మధ్యే హోరాహోరి పోరు జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news