ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో గత కొంత కాలం కిందట విడుదలైన స్కామ్ 1992 వెబ్ సిరీస్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో హర్షద్ మెహతా పాత్రలో ప్రతీక్ గాంధీ జీవించాడని చెప్పవచ్చు. అతని యాక్టింగ్ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సిరీస్‌కు ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ సిరీస్‌లో హర్షద్ మెహతాగా ప్రతీక్ గాంధీ చెప్పిన కొన్ని డైలాగ్‌లు కూడా ప్రేక్షకులను అలరించాయి.
కాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రతీక్ గాంధీ హర్షద్ మెహతా అవతారంలో బడ్జెట్‌పై తన అభిప్రాయం చెప్పాడు. చాలా మంది నన్ను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు ? అని టిప్స్ అడుగుతుంటారు, కానీ ఇండియాలో పెట్టుబడులు పెట్టమని చెబుతుంటాను. ఎందుకంటే ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది చాలా గ్రేట్ బడ్జెట్. ఇండియాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎవరైనా వృద్ధి సాధించవచ్చు. ఏదో ఒక నాడు 56 ఇంచుల ఛాతి ప్రపంచం ఎదుట గర్వంగా నిలబడుతుంది.. అని అన్నాడు. తరువాత స్కామ్ 1992లో పాపులర్ అయిన డైలాగ్‌ను అతను చెప్పాడు.
#Budget2021 pic.twitter.com/zlSplQ16P4
— Pratik Gandhi (@pratikg80) February 1, 2021
కాగా ప్రతీక్‌గాంధీ బడ్జెట్‌పై చెప్పిన మాటలకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి ఇప్పటికే ఎన్నో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. చాలా మంది దాన్ని రీ ట్వీట్ చేస్తున్నారు. స్కామ్ 1992 సిరీస్ ద్వారా ప్రతీక్ గాంధీ ఒక్క సారిగా పాపులర్ అయ్యాడు. అందులో హర్షద్ మెహతాగా అతను అద్భుతంగా నటించాడు. దీంతో సిరీస్‌ను చూసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.