వ్యోమగాముల చెమట, రక్తం, యూరిన్ తో కాంక్రీట్ ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!

-

యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ కాంక్రీట్ లాంటి మెటీరియల్ ని కనుగొన్నది. నిజంగా దీనిని ఎలా చేస్తున్నారు అనేది చూస్తే షాక్ అవ్వాల్సిందే. అయితే సైంటిస్టులు దుమ్ము, రక్తం, చెమట మరియు కన్నీళ్ళు తీసుకుని కాంక్రీట్ లాంటి మెటీరియల్ ని తయారు చేయడం జరిగింది. దీనిలో సైంటిస్టులు వ్యోమగాముల చెమట, రక్తం, కన్నీళ్లు వంటివి సేకరించి మాస్ లో కన్స్ట్రక్షన్ చేయాలని అనుకోవడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

మార్స్ కి ఒక ఇటుకని తీసుకు వెళ్లాలంటే 2 మిలియన్ యూఎస్ డాలర్స్ ని ఖర్చు చేయాలని… దీంతో ధర చాలా ఎక్కువ అవుతుంది అని అంటున్నారు. అయితే తాజా స్టడీ ప్రకారం చూసుకున్నట్టు అయితే.. ఒంట్లో ఉండే ప్రోటీన్ మరియు యూరియా (యూరిన్, చెమట, కన్నీళ్లు) వీటినన్నిటినీ అంటే కలిపి ఒక బలమైన కాంక్రీట్ మెటీరియల్ ని తయారు చేస్తున్నారు.

అక్కడ ఇది ఉపయోగించి కన్స్ట్రక్షన్ చేయడం పర్ఫెక్ట్ అని సైంటిస్టులు అంటున్నారు. ఇటుకలు మొదలైన సామాగ్రిని తీసుకు వెళ్లే బదులు ఇలా చేయడం వల్ల సులభంగా మరియు తక్కువ ధరకే చేయొచ్చు అని చెప్తున్నారు. ఇలా 500 కేజీలని ప్రొడ్యూస్ చేసి రెండేళ్ల మిషన్ ని పూర్తి చెయ్యాలని సైంటిస్టులు అంటున్నారు. అయితే నిజంగా ఇది చాలా విడ్డూరంగా ఉంది. మనిషి యొక్క కన్నీళ్ళు యూరిన్ చెమటతో చేయడం చాలా కొత్తగా వుంది. ఇది విన్న వాళ్ళు షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news