నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

వినాయం నిమజ్జనం రోజున తెలంగాణ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది ఓ కారు. ఈ ఘోర ప్రమాదం లో ఏకంగా ఆరుగురు వ్యక్తులు అక్కడి క్కడే మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా లోని కట్టంగూరు (మం), ముత్యాలమ్మగూడెం వద్ద ఆగి ఉన్న లారీ ని వెనక నుంచి వచ్చి ఢీ కొట్టింది.

దీంతో ఈ ప్రమాదం లో అక్కడిక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. స్పాట్ లో ఇద్దరు మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరోకరు మృతి చెందారు. ఈ నేపథ్యం లో నే ట్రాఫిక్ జామ్ లో ఆగి ఉన్న మరొక కారును వెనుక నుంచి ఢీకొట్టింది మరో లారీ. దీంతో మరో కారులో ఉన్న ముగ్గురు మృతి అక్కడిక్కడే మృతి చెందారు. మొత్తంగా జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతుల సంఖ్య ఆరుగురికి చేరుకుంది. ఇక చనిపోయిన ఆరుగురిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు పోలీసులు.