“టక్ రెబల్ స్టార్”… వైరల్ అవుతున్న డార్లింగ్ కొత్త లుక్..!

-

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. అంతే కాకుండా ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో ఆది పురుష్ అనే చిత్రం లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ప్రభాస్ సలార్ షూటింగ్ నుండి ఒక ఫోటో లీక్ అయ్యింది. అయితే ఈ ఫోటో లో ప్రభాస్ కాస్త బొద్దుగా కనిపించాడు. దాంతో ట్రోల్స్ వచ్చాయి. అంతే తాజాగా ప్రభాస్ కళాకార్ అనే సినిమా టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా ప్రభాస్ లుక్ ఎంతో ఆకట్టుకుంటోంది. బ్లాక్ షర్ట్ ధరించి ఇన్ షట్ లో ప్రభాస్ కనిపిస్తున్నారు. దాంతో టక్ రెబల్ స్టార్ అంటూ అభిమానులు ప్రభాస్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే సినిమా నుండి ఫస్ట్ లుక్ ఫస్ట్ గ్లింప్స్ రాగా ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news