ట్రెండ్‌ అవుతున్న బీచ్‌లో బీర్‌ బాతింగ్.. క్యాన్సర్‌ వస్తుంది అంటున్న శాస్త్రవేత్తలు

-

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టాలు ఉంటాయి. రొటీన్‌కు భిన్నంగా, ఇలా కూడా చేస్తారా అనిపించుకునేలా ఉండటం కొందరికి నచ్చుతుంది. కొందరు సింపుల్‌గా ఉంటారు. ఇక పిచ్చి మరీ ముదిరితే.. ఆ తర్వాత ఏం చేస్తారో వారికే తెలియదు. అవే ట్రెండ్‌ అయిపోతాయి. ఎవరో కోపంలో అన్న ఒక్క మాట నేడు సోషల్‌ మీడియానూ ఊపేస్తుంది. ఆ కుర్చిని మడతపెట్టి… అని ఆ తాత ఏంఅంటా అన్నాడో.. వాటిపై డిజే సాంగ్స్‌, టీషర్ట్స్‌ కూడా వచ్చేశాయి. ఇలానే ఎప్పుడో ఒక మహానుభావుడు క్రేజీగా ఉంటుంది కదా అని బీచ్‌లో బీరుతో స్నానం చేశాడు. ఇక అది చూసిన జనాలంతా.. ఇదేదో బాగుందే అనుకుని అందరూ అదే ఫాలో అవుతున్నారు. కానీ ఇలా బీచ్‌లో బీర్‌తో బాత్‌ చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయట. మీ ఫ్యాషన్‌ ఏమో కానీ..ముందు మీరు ఏ లోషన్‌ రాసుకోవడానికి లేకుండా అయిపోతార్రా బాబు అంటున్నారు నిపుణులు.!

బీచ్‌లో బట్టలిప్పి ఒంటి మీద బీర్ పోసుకుంటారు. ఇక ఎండలో పడుకుంటారు. ఇలా చేస్తే ఒంటి మీద మాలినాలు పోయి.. చర్మం శుభ్రంగా అవుతుందట. చర్మం బాగా మెరిసిపోతుందని నమ్ముతున్నారు. ఎవరో టైమ్ పాస్ కోసం మెుదలుపెట్టిన ఈ విధానాన్ని ఇప్పుడు ఎక్కువగా జనాలు పాటిస్తున్నారు. ఇలా బీరుతో స్నానం చేస్తే.. చర్మం మెరిసిపోతుందని ఎక్కడా ఆధారాలు లేవు. ఈ పద్ధతి మంచిది కాదు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

బీరుతో స్నానం చేస్తే.. అందులో ఉండే.. హాప్ అనే పదార్థం మెలనిన్‌ను ప్రేరేపితం చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుందని చాలా మంది నమ్మకం. యూవీ కిరణాల నుంచి విడుదల అయ్యే రెడియేషన్ నుంచి కాపాడుతుందని అంటున్నారు. ఈ బీర్ టానింగ్ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని సోషల్ మీడియాలో పుకార్లు షికార్డు కొడుతున్నాయి. కానీ ఇలా బీర్ శరీరం మీద పోసుకుంటే.. క్యాన్సర్(Cancer) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీరుతో స్నానం చేస్తే.. చర్మం కాంతివంతగా అవుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు.

అదృష్టం ఏంట్రా అంటే.. ఈ పిచ్చి ఇంకా ఇండియాలో స్టాట్‌ కాలేదు. కానీ మీరు చూసే ఉంటారు.. పెళ్లికి ముందు చేసే హల్దీ ఫంక్షన్స్‌లో పసుపు, పాలుతో మంగళస్నాం చేయిస్తారు.. ఇప్పుడు కొంతమంది బీర్‌ కూడా పోస్తున్నారు. ఇది కూడా ప్రమాదకరం. ఒంటి మీద బీర్ పోసుకోవడం మంచి పద్ధతి కాదు. బీర్‌ బాతింగ్‌ గానీ మన ఇండియాలో ట్రెండ్‌ అయిందంటే.. ఇక వైన్ షాపుల వాళ్లకు పండగే పండగు.. అసలే కొన్ని రాష్ట్రాల్లో వెరైటీ పేర్లతే కొత్త కొత్త బీర్లు తయారు చేస్తున్నారు. ఎలాగో అవి తాగడానికి జనాలు ఇష్టపడటం లేదు. ఇలా అయినా ఉపయోగపడతాయేమో..!

Read more RELATED
Recommended to you

Latest news