చిరంజీవి వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయింది: ఉండవల్లి

-

ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కొందరికి ఇబ్బంది కలిసిగించినా ఆయన అన్న మాటల్లో వాస్తవం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంగీకరించారు. మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటల్లో సత్యం ఉందని , ఈ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంతమంది అంటున్నట్లు చిరంజీవి పిచ్చుక కాదని, సినిమా పరిశ్రమ ఒక పిచ్చుక అని వారికి గట్టిగా బదులిచ్చారు ఉండవల్లి. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి ఒకే పార్టీలో ఉన్నా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు అంటూ ఉండవల్లి చెప్పారు. బహుశా ఒకే పార్టీలో ఉండి వారికి విరుద్ధంగా ప్రవర్తించడం అంత ఆషామాషీ విషయం కాదని చిరంజీవిని ఉండవల్లి పొగిడారు.

ఇక చిరంజీవి అడగడం వల్లనే హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు కనీసం పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండేలా కేంద్రం ఆరోజు ఒప్పుకుందన్నారు ఉండవల్లి. అలంటి చిరంజీవికి ప్రత్యేక హోదా గురించి పోరాడండి అని సలహా ఇవ్వడంలో తప్పేముంది అంటూ చిరు మాటలను సమర్ధించారు.

Read more RELATED
Recommended to you

Latest news