శృంగారం చేస్తూ మరణించిన ఉద్యోగి.. కోర్టు తీర్పుతో షాక్ అయిన కంపెనీ…!

-

ఓ ఉద్యోగి కంపెనీ విధుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఓ మహిళ పరిచయం అవడంతో ఆమెతో రాసలీలలలో మునిగి తేలాడు. మధ్యలో ఒక్క సారిగా స్ట్రోక్ వచ్చిన అతడు ఉంటున్న హోటల్ లో అక్కడికక్కడే చనిపోయాడు దాంతో సదరు వ్యక్తి కుటుంభం కొంత కాలంగా తన భర్తకి రావాల్సిన భీమా సొమ్ము కోసం పోరాటం చేస్తుండగా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దాంతో షాక్ అయిన కంపెనీ కోర్టు తీర్పుని గౌరవ్సిస్తున్నాం అంటూ పరిహారం చెల్లించింది. ఈ ఘటన ఫ్రాన్స్ లో సంచలన సృష్టించింది.

ఫ్యాన్స్ రైల్వే కి సంభందించిన ఓ కంపెనీలో ఓ ఉద్యోగం చేస్తున్న జేవియర్ అనే వ్యక్తి 2013 లో ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఓ మహిళతో తాను ఉంటున్న హోటల్ గదిలోకి వెళ్లి సెక్స్ లో పాల్గొన్నాడు. కాసేపటికి అతడికి గుండె పోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అప్పటి నుంచీ ఆయన కుటుంభం ఆయనకి రావాల్సిన భీమా ఇవ్వాలని కోరగా అందుకు సదరు కంపెనీ నిరాకరించింది.

దాంతో కుటుంభ సభ్యులు కోర్టుని ఆశ్రయించగా కోర్టు ఈ మృతిని వర్క్ ప్లేస్ యాక్సిడెంట్ గా పరిగణించి అతడికి భీమా సొమ్ము ఇవ్వాలని సంచలన తీర్పు చెప్పింది. అయితే అతడు ఆమెతో సెక్స్ లో ఉండగా ఈ దారుణం జరిగిందని అలాంటప్పుడు మాకు ఎలాంటి సంభంధం లేదని కంపెనీ వాదించగా కంపెనీ పని మీద వెళ్ళినప్పుడు అన్నం తినడం, మంచి నీళ్ళు త్రాగడం లానే సెక్స్ చేయడం సాధారణ చర్య ఇందులో ప్రత్యేకత లేదు కాబట్టి సొమ్ము చెల్లించండి అంటూ కోర్టు తీర్పు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news