అవతలి వారికి మీపై ఇష్టం ఉందని వాట్సాప్ ఎలా తెలియజేస్తుందో తెలుసుకోండి.

-

మీకు నచ్చిన వారి గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఉంటుంది. అలాంటప్పుడు వారి గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటారు. వారి లైక్స్, పిక్చర్స్ చూసి వారి వ్యక్తిత్వం మీద ఒక అంచనాకి వస్తారు. కానీ అవతలి వారికి మీరు నచ్చారని తెలిపేలా కొన్ని వాట్సాప్ సంకేతాలు కనిపిస్తాయి. అవును, అవతలి వారికి మీరు నచ్చారని, మీతో మాట్లాడాలని వారికి ఉందని వాట్సాప్ తెలియజేస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

టైపింగ్

అవతలి వారికి మీరు నచ్చారని అనిపించినపుడు, మీకు మెసేజ్ చేయాలని చూస్తున్నప్పుడు టక్కుమని మెసేజ్ రాకుండా మెసేజ్ టైప్ చేస్తున్నట్టు ఎక్కువ సేపు ఉంటుంది. ఎందుకంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ, డిలీట్ చేస్తూ ఉంటారు. అందుకే టైపింగ్ అని ఎక్కువ సేపు కనిపిస్తూ ఉండి కూడా ఎలాంటి మెసేజ్ రాకుండా ఉంటుంది.

మీరు ప్రొఫైల్ పిక్చర్ మార్చగానే మెసేజ్ చేస్తారు

ఇది సులభంగా గుర్తించదగిన అంశం. కొత్త ప్రొఫైల్ పిక్ మార్చగానే, దాని మీద కామెంట్ చేస్తారు. చాలా సార్లు మీకు తెలియని చిన్న చిన్న అంశాలు కూడా వారు గమనిస్తారు. అవి మీకు తెలియజేస్తారు.

స్టేటస్ కి అర్థం అడుగుతారు

మీరు పెట్టే స్టేటస్ అర్థం ఏంటని ఎక్కువగా అడుగుతుంటారు. మీరు ఏ చిన్న పదం పెట్టినా, ఒక వాక్యం పెట్టినా దాని వెనక ఉన్న లోతైన ఆలోచన ఏంటని ఆలోచించి, మిమ్మల్ని అడుగుతారు.

వాట్సాప్ మిస్డ్ కాల్స్

చాలాసార్లు వాట్సాప్ నుండి మిస్డ్ కాల్స్ ఇస్తారు. ఏంటని తిరిగి అడిగితే చూస్కోకుండా వచ్చింది అని చెబుతారు. ఇదంతా కేవలం మీ మీద ఉన్న క్రష్ కారణంగానే అని అర్థం చేసుకోవచ్చు.

బ్లూ టిక్

వాట్సాప్ లో మీరు మెసేజ్ పంపగానే బ్లూ టిక్ గా మారి, వెంటనే స్పందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news