ఎంత ధైర్యంరా బాబు.. పాముకు షాంపూతో స్నానం చేయిస్తున్నాడు..

-

చాలా మందికి జంతువులను పెంచుకోవడం అలవాటు.అయితే కుక్క,పిల్లి లాంటి జంతువులను పెంచుకుంటే ఒకే కానీ..ఈ మధ్య విష జంతువులను సర్పాలను పెంచుకుంటున్నారు..కేవలం పెంచుకోవడం మాత్రమే వాటి ఆలనా పాలనా కూడా చూసుకుంటున్నారు. పాములంటే మాత్రం ప్రతి ఒక్కరూ భయపడిపోతాం. అసలే విష జంతువు కావడంతో కాటేస్తే ప్రమాదం అనే ఉద్దేశంతో పాములతో చాలా జాగ్రత్తగా ఉంటాం..

అయితే , కొంత మంది మాత్రం అస్సలు భయపడరు.. పాములను చేతి పట్టుకోవడం, మెడలో వేసుకోవడం వంటి స్టంట్‌లు చూసే ఉంటాం. ఎందుకంటే సోషల్ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా ఇట్టే వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వాస్తవానికి ఇది స్టంట్‌ కాదు కానీ ఏదో కుక్కపిల్లకి స్నానం చేయించినట్లుగా కోబ్రాకి షాంపూతో స్నానం చేయిస్తున్నాడు ఓ వ్యక్తి. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి చాలా పొడువుగా ఉన్న కింగ్‌ కోబ్రాకి తల మీద నుంచి నీళ్లు పోస్తూ స్నానం చేయిస్తున్నాడు. పైగా ఆ పాము అతడు నీళ్లు పోస్తున్న మగ్గును పలుమార్లు కాటేస్తోంది.

కానీ ఆ వ్యక్తి అదేం పట్టించుకోకుండా చక్కగా కోబ్రాకి స్నానం చేయించే పనిలో ఉన్నాడు. మహిళలు పురుషుల కంటే 5% ఎక్కువగా బతకడానికి కారణం ఇదే నంటూ ఈ వీడియో గురించి చెబుతున్నారు. ఎందుకంటే పురుషులు డేరింగ్‌ స్టంట్‌ చేస్తుంటారు అందువల్ల ఎక్కువ కాలం జీవించరంటూ గొప్ప స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు..అయితే ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్ అయ్యింది.వేల మంది లైక్ లు కొట్టారు. పెంపుడు జంతువులకుమ స్నానం చేయించినంత ఈజీగా కోబ్రాకు స్నానం చేయించడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు.. మొత్తానికి ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..
https://www.instagram.com/reel/CllQW0EgnMS/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Latest news