ఇదో ప్రభుత్వ ఆస్పత్రి.. ఇక్కడ ఇంగ్లీషు మందులతో వైద్యం చేయరు. మంత్రాలతో వైద్యం చేస్తారు. కొన్నాళ్లుగా ఇదే అనవాయితీ కొనసాగుతోంది. ఎవరికి పాము కరిచినా వింతైన పద్ధతుల్లో పూజలు చేస్తుంటారు. అయితే తనను పాము కాటు వేసింది.. రక్షించాలని వేడుకుంటూ ఓ బాధితుడు ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే.. అతడికి ట్రీట్‌మెంట్ చేయాల్సిన డాక్టర్లు.. భూతవైద్యం చేశారు. మధ్యప్రదేశ్‌లోని శివపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆస్పత్రిలో చికిత్స అందించాల్సిన వైద్యులు ప్రాణపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి మంత్రతంత్రాలతో పూజలు నిర్వహించారు.
విషప్రభావంతో బాధపడుతున్న బాధితుడికి ఎమర్జెన్సీ వార్డులో గడ్డిపరకలు చేతిలో పట్టుకుని వింతగా మంత్రాలు చదువుతూ నిలబడిపోయారు. చేతిలో సెలైన్ బాటిల్స్ పట్టుకుని పూజలు చేయడం విడ్డూరంగా ఉంది. కానీ, ఎవరూ వైద్యుడిని ప్రశ్నించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలా భూతవైద్యం చేయడంపై వైద్యాధికారులు స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటివి చేయకూడదని, దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు.
Madhya Pradesh: A video of a snake bite victim being treated by witchcraft in a government hospital in Sheopur has surfaced. Resident Medical Officer (Pic 3) says,” This is a wrong practice. We will investigate the matter and take appropriate action”. pic.twitter.com/6n1YSXi9Ur
— ANI (@ANI) November 1, 2019