సాధారణంగా వేడి నుండి చల్లదనం పొందాలంటే మనం ఫ్యాన్ కింద ఉంటాం.. కొంచం డబ్బు ఉంటే ఏసీ వినియోగిస్తాం. అయితే ఫ్యాన్ అయినా.. ఏసీ అయినా ఇంటి వరకు లేదా ఆఫీస్ వరకు మాత్రమే. మరి బయటకు వచ్చినప్పుడు కూడా చల్లగా ఉండాలంటే ఎం చెయ్యాలి? ఆ అవకాశమే లేదు కదా! కానీ ఇప్పుడు ఈ అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది.
ఈ అవకాశాన్ని సోనీ కంపెనీ “రెయోస్ ప్యాకెట్” పేరిట వేరబుల్ ఎయిర్ కండిషనర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నిజానికి ఈ ఏసీ గురించి ఎంతోకాలం నుండి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఈ ఏసీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఏసీ ప్రస్తుతం జపాన్‌లో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇంకా దీని ధర రూ.9వేల వరకు ఉంటుంది.
ఇంకా ఈ ఏసిని టీషర్టులు, షర్టుల వెనుక లోపల ధరించేలా డిజైన్ చేశారు. ఇంకా ఇది ఉపయోగిస్తే వీపు వైపు చల్లగా ఉంటుంది. ఇంకా వేడిగాలిని శరీరం నుండి బయటకు పంపేందుకు ఈ ఏసీలో ఒక చిన్న ఫ్యాన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్యాకెట్ ఏసీ ముఖాన్ని మాత్రమే చల్లగా చెయ్యదు.. ఇంకా ఏసిని స్మార్ట్ ఫోన్ తో సర్దుబాటు చేసుకోవచ్చు. ఇంకా ఏసీ బ్యాటరీ రెండు నుండి నాలుగు గంటలు వస్తుంది అని సమాచారం. అయితే ఇది కేవలం ఏసీలా చల్లదనం మాత్రమే కాదు చలికాలంలో హీటర్ లా కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఈ ఏసీ మన భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో చూడాలి.