మోసపోయే వాడు ఉన్నన్ని రోజులు మోసం చేస్తూనే ఉంటారు కొందరు మోసగాళ్లు. ప్రజల్ని మోసం చేయడానికి కొందరు కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఇకపోతే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ పెద్ద మోసం బయటికి వచ్చింది. ఈ వీసాల పేరుతో మోసాలు చేస్తున్న టూర్ అండ్ ట్రావెల్ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కొరడా ఝుళిపించారు. 2 రోజుల క్రితం ఢిల్లీ తోపాటు ఘజియాబాద్ లోని మొత్తం ఎనిమిది ప్రాంతాలలో అనేక టూర్ అండ్ ట్రావెల్ కంపెనీలకు చెందిన పూర్తి వివరాలను శోధించారు.
ఇక ఇందులో వారికి లెక్క చూపని రూ. 3.57 కోట్ల నగదు, పలు పత్రాలను, వాటితో పాటు డిజిటల్ రికార్డులను డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే సదరు టూర్ అండ్ ట్రావెల్ కంపెనీలు విదేశాలకు ఈ వీసా సేవలను అందించే పేరుతో చెల్లింపులు గేట్ వే ల ద్వారా అనధికార లావాదేవీలు విదేశాల నుంచి జరిగినట్టుగా వారికి సమాచారం అందడంతో వారిపై దాడి చేయాల్సి వచ్చిందని డైరెక్టర్ తెలియజేశారు. ఇందుకు సంబంధించి విదేశీ మారక నిర్వహణ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.